telugudanam.com

      telugudanam.com


రాబోవు కార్యక్రమాలు
     
సామెత: రక్షించిన వాడినే భక్షించినట్లు.

మంచిమాట: శ్రమవల్ల లభించేది గొప్ప బహుమానం కానే కాదు. శ్రమవల్ల వచ్చే మార్పే గొప్ప బహుమానం.

నీతి కథ : స్వామీజీ - సొమ్ములు [ వివరాలకు... ]


ఆట : గురి చూసి విసరడం [ వివరాలకు... ]

తెలుగు సైటు: తెలుగు సాహిత్య వేదిక [ వివరాలకు... ]
తెలుగుదనం విషయ సూచిక


సంస్కృతి, సాంప్రదాయాలు


సాహిత్యం


చిన్నపిల్లల కోసం


వనితల కోసం


అందరి కోసం


 

ఇల్లలుకుతూ అలుకుతూ

ఆంధ్రప్రదేశ్ అవతరణోత్సవ దినాన
అబద్దం ఆడతానికి నోరు రాక 
అంత క్షేమంగా వున్నామని చెప్పలేక 
అటూ ఇటూ వూగిసలాడూతూ 
అల్లుకు వచ్చిన గీతం వినండి 
నిజానికి కాలం మన మీద యింకా 
కారాలు మిరియాలు నూరుతూనే ఉంది 
కఠినంగా కరిచింది కాలం మనల్ని 
అందరి మనసుల్ని అడ్డంగా విరిచింది 
ఐక్యతా లత అల్లుకున్న అందాల పూల పందిరి మీద 
అంగుళానికి అరడజను వంతున 
గొంగళి పురుగులు ప్రాకుతున్నాయి 
వాటి పీద్డ పడలేక తోటంతా 
పీకేద్దామంటున్నారు కొందరు! 
చుక్కల లోకం లోకి ఎక్కాలని 
వేసిన నిచ్చెన్లు విరగొట్టారు కొందరు 
కూచున్న కుర్చీ కుషన్లలో 
గుండు సూదులు గ్రుచ్చి వెళ్ళారు కొందరు 
వానదేవుణ్ణి రమ్మని టెలిగ్రాం పంపితే 
వరద దేవుడొచ్చి కూర్చున్నాడు 
పైర గాలిని రమ్మని కబురు చేస్తే 
తుఫాను గాలులు తొంగి చూశాయి 
కూలిపోయిన నిరుపేదల గుడిశెలు 
కాలిపోయిన గ్రామీణుల జీవితాలు 
హృదయం దహించుకు పోయే 
విషాద సంఘటనలు ఒక వైపు 
కొండ అడ్డు తగిలి రెండుగా చీలుతానంటున్న ప్రవాహం 
కక్షలు కార్పణ్యాలు ప్రాంతీయ తత్వాల ప్రభావం 
మనసులు చెదిరి మనుషులందరూ చెదిరి 
తోలగి దూరంగా పోతున్న దృశ్యాలు ఒక వైపు 
ఏం చెప్పను నాదేశపు శోభ 
మనసులు మారడం లేదు 
మాకేమిటి లాభమనీ 
మాట మారడం లేదు ఆంధ్రులెవరో అరవలెవరో అసలే తెలీదు నాకు 
తెలుగు వారికి యీ మధ్య పుట్టిన తెగులేమితో తెలీదు నాకు 
అనైక్యత బీజాలు నాటిన వారికి నికరంగా వచ్చిన 
ఆదా ఎంతో తెలీదు నాకు 
చరిత్రను వెనక్కు మళ్ళింప జూస్తున్న వారి 
చేతుల్లో ఎంత బలముందో తెలీదు నాకు 
ఇల్లలుకుతూ అలుకుతూ ఈగ తన పేరు తాను మరిచిపోయినట్లు 
ఇటీవల మన తెలుగువాండ్లు తమ ఊరూ పేరూ మరచిపోయి 
ఊరేగారు వీధుల వెంట! 
అవును ప్రజలు నిజంగా నిద్రపోతున్నారు 
చైతన్యం చంద్రమండలానికి వలస పోయింది 
మనిషి కత్తికి పదును పోయింది 
చరిత్ర పొలంలో నాట దలచుకున్న 
పైరుకు అదును పోయింది 
పామరుడు పొదలో పొంచి కూర్చున్నాడు 
పాములా కాటేస్తాడు బహుపరాకే 
తెల్లవరకుండా సూర్యుడికి మబ్బులు అడ్డు వస్తున్న 
బడాబడా ఖామందులు బహుపరాకే!
Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: