telugudanam.co.in

      telugudanam.co.in

   

లక్షద్వీప్‌

లక్షద్వీప్‌

ఇంతకు ముందు లక్షదీవులు, మినికాయ్‌, అమీన్‌ దీవులు అని పిలువబడే మూడు గుంపుల దీవులను కలిపి ఇప్పుడు లక్షద్వీపాలు అని పిలుస్తున్నారు. ఇవి కేరళరాష్ట్ర పడమటి తీరం నుంచి సుమారు రెండు వందల నుంచి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రంలో ఉన్నాయి. ఇవి మెత్తం 27 దీవులు. ఇందులో కేవలం పదింటిలోనే జనావాసం ఉంది. ఇందులో ఆండ్రోత్తి అనేది అన్నిటికన్నాపెద్దదీవి. దీని విస్తీర్ణం 4.8 చదరపు కిలోమీటర్లు.

అన్నిటికన్నా చిన్నదీవి పేరు బిట్రా. ఇది కేవలం 0.1 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. మూడున్నర కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న కవరత్తి అనేదీవి ఈ దీవులన్నిటిలోకి ముఖ్యపట్టణం. అన్ని దీవులలో కలిపి జనాభా లక్షమంది కూడా ఉండరు. ఈ దీవులలో నివసించేవారు దాదాపు అందరూ ముస్లింలలో ఒక శాఖకు చెందిన వారు. వీరి బ్రతుకుతెరువు కొబ్బరిసాగు. కేరళలోని కొచ్చిన్‌ నుంచి ఈ లక్షద్వీప దీవులకు ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో నడిచే ఓడలు ఉన్నాయి. లక్షద్వీప్‌

ఆ ఓడలే అక్కడున్న వివిధ దీవులకు మనుషులను, సామాన్లను చేరవేస్తుంటాయి. ప్రభుత్వ పర్యాటకశాఖ వారిచే నిర్వహించబడే వసతిగృహాలు ఒకటో రెండో ఈ దీవులలో ఉన్నాయి. భారత ప్రభుత్వ పర్యాటక శాఖ వారిదిగాని, కేరళ ప్రభుత్వ పర్యాటకశాఖ వారిదిగాని కార్యాలయం బెంగుళూరులో ఉండొచ్చు. అక్కడ విచారిస్తే మీకు మరిన్ని వివరాలు లభిస్తాయి.


మూలం: 26-Jun-08, గురువారం, సాక్షి(ఫ్యామిలీ).

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: