telugudanam.co.in

      telugudanam.co.in

   

‌శుచీంద్రం

కన్యాకుమారి దర్శించినవారిలో నూటికి తొంభయి మంది అటు నుంచి అటే వెళ్ళిపోతారు. కాని ప్రక్కనే వున్న శుచీంద్రం చూచి వచ్చేవారు అరుదు. అసలు, కన్యాకుమారినానుకుని శుచీంద్రం అనేవూరు ఒకటివున్నదని తెలిసినవారు చాలా తక్కువ. ఈ శుచీంద్రంలోని ఆలయం అతి ప్రాచీనమయినదని, భారతదేశంలోని అత్యంత పురాతనమయిన దేవాలయాలలో ఇది కూడా ఒకటని, చరిత్రకారులు నిర్ణయించారు. కన్యాకుమారి నుంచి శుచీంద్రం ఎనిమిది మైళ్ళు. నాగర్‌కోయిల్‌ నుంచి 2 లేక 3 మైళ్ళు... కన్యాకుమారి నుంచి నాగర్‌కోయిల్‌ వెళ్ళే బస్సు, సరిగా శుచీంద్రంలోని గుడివున్న వీధి మొదట్లోనే ఆగుతుంది. బస్సు దిగిన చోట నుంచి ఆలయం ఒక్క ఫర్లాంగు మాత్రమే. ఆలయ గోపుర ద్వారం కనబడుతూనే ఉంటుంది. ఆలయం చేరుకోవడానికి ముందుగా చాలా పెద్ద నిడివి వెడల్పు వుండే పుష్కరిణి వుంది. శుచీంద్రం ఒక పెద్ద గ్రామం. ఈ శుచీంద్రం ఆలయానికి, కన్యాకుమారిలోని కుమారి అమ్మవారి ఆలయానికి సంబంధం వుంది.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: