|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
మీకు తెలుసా?
(07-01-2008)
(యక్ష ప్రశ్నలు)
మనిషికి దైవిక బంధువులెవ్వరు?
భార్య /భర్త
మనిషికి ఆత్మ ఎవరు?
కుమారుడు
మానవునకు జీవనాధారమేది?
మేఘం
మనిషి దేనివల్ల సంతోషించును?
దానం
లాభాల్లో గొప్పది ఏది?
ఆరోగ్యం
(31-12-2007)
(యక్ష ప్రశ్నలు)
బాటసారికి, రోగికి, గృహస్థునకూ, చనిపోయిన వానికి బంధువులు ఎవరు?
సార్థం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు
ధర్మానికి ఆధారమేది?
దయ దాక్షిణ్యం
కీర్తికి ఆశ్రయమేది?
దానం
దేవ లోకానికి దారి ఏది?
సత్యం
సుఖానికి ఆధారం ఏది?
శీలం
(24-12-2007)
(యక్ష ప్రశ్నలు)
జన్మించియు ప్రాణం లేనిది?
గుడ్డు
రూపం ఉన్నా హృదయం లేనిది?
రాయి
మానవునికి దుర్జనత్వం ఎలా వస్తుంది?
శరణుజొచ్చిన వారిని రక్షించకపోవడం వల్ల
ఎల్లప్పుడూ వేగం గలదేది?
నది
రైతుకు ఏది ముఖ్యం?
వాన
(17-12-2007)
(యక్ష ప్రశ్నలు)
మానవునికి సజ్జనత్వం ఎలా వస్తుంది?
ఇతరులు తనపట్ల ఏపని చేస్తే, ఏమాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరులపట్ల ఆ పని చేయకుండా ఆ భావము రానీయకుండా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడువుంటాడో అట్టివానికి సజ్జనత్వం వస్తుంది.
తృణం కంటే దట్టమైనది ఏది?
చింత
నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది?
చేప
రాజ్యమేలే వాడు దైవత్వం ఎలా పొందుతాడు?
అస్త్ర విద్యచే
రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది?
యజ్ఞం చేయుటవలన
(10-12-2007)
(యక్ష ప్రశ్నలు)
మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు?
మృత్యుభయాన
జీవ స్మృతుడెవరు?
దేవతలకూ అతిరధులకూ పితృసేవకాదులకు పెట్టకుండా తినువాడు.
భూమి కంటే భారమైనదేది?
జనని
ఆకాశం కంటే పొడవైనది ఏది?
తండ్రి
గాలి కంటే వేగమైనది ఏది?
మనస్సు
(03-12-2007)
(యక్ష ప్రశ్నలు)
మానవుడు దేనిచే శ్రోత్రియుడవుతాడు?
వేదం
మానవునికి సహాయపడునదేది?
ధైర్యం
మానవుడు దేనివల్ల బుద్దిమంతుడు అవుతాడు?
విద్వాంసుని సేవించడం వల్ల
మానవుడు మానవత్వమును ఎట్లు పొందుతాడు?
అధ్యయనము వలన
మానవునికి సాధుత్వాసాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి?
నిరంతరమూ ప్రతాచరణం వల్ల సాధూత్వమూ, శిష్టాచార భ్రష్టత్వం వల్ల అసాధుత్వమూ
(26-11-2007)
(యక్ష ప్రశ్నలు)
సూర్యుణ్ణి నడుపునదేది?
బ్రహ్మం
సూర్యుణ్ణి సేవించు వారెవరు?
దేవతలు
సూర్యుడు దేనిచే అస్తమించును?
ధర్మం
సూర్యునికి ఆధారమేమి?
సత్యం
మానవుడు దేనిచేత మహిమ పొందుతాడు?
తపస్సు
(19-11-2007)
శివుడు నివాసం ఉండేది ఎక్కడ?
కైలాస పర్వతం మీద
వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ద్వారపాలకులు ఎవరు?
జయ, విజయములు
యమలోకంలో పాప, పుణ్యాలు లెక్కబెట్టేవాని పేరేమిటి?
చిత్రగుప్తుడు
కోరిన కోరికలు తీర్చే దివ్య శక్తులు గల గోవు పేరేమిటి?
కామధేనువు
హాలాహలం తర్వాత క్షీరసాగర మధనం సమయంలో వెలువడినది ఏది?
కల్పవృక్షం
(12-11-2007)
తూర్పు దిక్కును పాలించేది ఎవరు?
ఇంద్రుడు
సూర్యుని కుమార్తె పేరేమిటి?
తపతి
గరుడ పురాణాన్ని ఎవరు ఎవరకి ఉపదేశించారు?
శ్రీ మహావిష్ణువు గరుత్మంతునకు ఉపదేశించారు
త్రిలోకములు అంటే ఏమిటి?
స్వర్గలోకము, మర్త్యలోకము, పాతాళము లను త్రిలోకములు అంటారు
అర్జునుని ధనుస్సు పేరేమిటి?
గాండీవం
(05-11-2007)
త్రిమూర్తులను పసి పాపలుగా మార్చిన పతివ్రత ఎవరు?
అనసూయ
కోరిన కోరికలు తీర్చే చెట్టు పేరేమిటి?
కల్పవృక్షం
రావాణాసురుడు తనను అపహరించి తీసుకుని వెడుతున్నప్పుడు సీతాదేవి తన నగలను ఎక్కడ జారవిడిచింది?
ఋష్యమూకం అనే పర్వతం మీద
భౌతిక విజ్ఞానాన్ని తెలిపే శాస్త్రం ఏ వేదంలో ఉంది?
అధర్వణ వేదం
కైకేయి దగ్గర ఉండే ప్రధాన దాసి పేరేమిటి?
వంధర
ఏక చక్రరధారూఢుడు అని ఎవరిని అంటారు?
సూర్యుడిని
యమునా నదికి మరోపేరు ఏమిటి?
కాళింద కన్య
శమిచెట్టు అని దేనిని అంటారు?
జమ్మిచెట్టు
సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి చేరడాన్ని ఏమని పిలుస్తారు?
సంక్రమణం
రధ సప్తమి ఏ రోజు జరుపుకుంటారు?
మాఘ శుద్దసప్తమినాడు
పురుషార్ధములు ఎన్ని? అవి ఏవి?
పురుషార్ధములు 4. అవి 1.ధర్మము 2. అర్ధము 3. కామము 4. మోక్షము
యుధిష్టరుడు అంటే ఎవరు?
ధర్మరాజు
ఉపనిషత్తులు ఎన్ని?
108
మహాభారత యుద్ధంలో ఎన్ని అక్షౌహిణుల సైన్యం పాల్గొంది?
18 అక్షౌహిణులు
పాండవ మధ్యముడు ఎవరు?
అర్జునుడు
సవ్యసాచి అని ఎవరిని పిలుస్తారు?
అర్జునుడిని
బాణాసురుని కూతురు పేరేమిటి?
ఉష
అగ్నిదేవుని భార్య ఎవరు?
స్వాహాదేవి
అష్టావకృని తల్లి పేరేమిటి?
సుజాత
శ్రీ రాముని నమ్మిన బంటు ఎవరు?
ఆంజనేయుడు
తక్షకుడు ఎవరు?
సర్పరాజు
ద్వివిధ అక్షరాలు అని వేనిని అంటారు?
అచ్చులు, హల్లులు
త్రివిధ సుందర పురములు ఏవి?
1. బ్రహ్మపురము 2. విష్ణుపురము 3. శివపురము
చతుర్విధ స్వభావములు ఏవి?
1. బ్రాహ్మణ స్వభావము 2. క్షత్రియ స్వభావము 3. వైశ్య స్వభావము 4. శూద్ర స్వభావము
మత్స్యపురాణాంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి?
14,000 శ్లోకాలు
పరీక్షిత్తుని కొడుకు?
జనమేజయుడు.
శమీక ముని కుమారుడు?
శృంగి.
ధృవుని భార్యలు?
భ్రమ మరియు ఇల.
కురుక్షేత్రము అనగా?
కురురాజు దున్నిన ప్రాంతము.
హిరణ్యకశిపుని భార్య?
లీలావతి.
పరశు రాముని తల్లితండ్రులు?
జమదగ్ని, రేణుక
భీష్ముని తండ్రి?
శంతన మహారాజు
ద్రోణుని సంహరించినవాడు?
దృష్టద్యుమ్నుడు
సహదేవుడి భార్య పేరు?
విజయ
విరాటుని కొలువులో ఏ పేరుతో ధర్మరాజు ఆశ్రయం పొందాడు?
కంకుభట్టు
బలి చక్రవర్తి భార్య?
వింధ్యావళి
ద్రోణుడి తండ్రి పేరు?
భరద్వాజుడు
అర్జునుని శంఖం పేరు?
దేవదత్తం
శ్రీ కృష్ణుని కుమారులు?
ప్రద్యుమ్నుడు, సాంబుడు.
కర్ణుడి కొడుకులను చంపినవాడు?
నకులుడు
శ్రీ కృష్ణుని అష్టభార్యల పేర్లు?
రుక్మిణీ, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రవింద, భద్రాదేవి, నాగ్నజితి, లక్షణ
శ్రీ రాముడు పర్ణశాల నిర్మించుకున్న ప్రాంతంపేరు?
పంచవటి
వ్యాసుడి అసలు పేరు?
కృష్ణ ద్వైపాయనుడు
ఘటోత్కచుని కొడుకు పేరు?
అంజనపర్వుడు
రావణాసురుని తల్లి పేరు?
కైకసి
(15-06-2007)
శ్రీకృష్ణుని మేనమామ?
కంసుడు
ఇంద్రజిత్తు మరోపేరు?
మేఘనాధుడు
కురువంశ రాజులు?
కౌరవులు
పార్వతి అవతారాలలో ఒకటి?
కాళి
సప్తమహర్షుల్లో ఒకరు?
వశిష్టుడు
(19-5-2007)
జాంబవతి, శ్రీకృష్ణుల కుమారుడు ఎవరు?
సాంబుడు
ఏకదంతుడు ఎవరు?
వినాయకుడు
భద్రకాళి అంటే ఎవరు?
పార్వతీదేవి
వశిష్టుని భార్య పేరేమి?
అరుంధతి
ఏకచక్రాధిపత్యము అంటే ఏమిటి?
సర్వాధికారము
(28-04-07)
పారిజాతాపహరణం కావ్యాన్ని రచించింది ఎవరు?
నంది తిమ్మన
రామ, రావణ యుద్ధానికి ముహూర్తం పెట్టింది?
రావణుడు
భక్త రామదాసు అసలు పేరు?
కంచర్ల గోపన్న
లక్ష్మణుడి మరో పేరు?
సౌమిత్రి
ఆదిత్య హృదయాన్ని శ్రీరాముడికి ఉపదేశించినవారు?
అగస్త్యుడు
(21-04-07)
"వాణి నా రాణి" అన్న తెలుగు కవి ఎవరు?
పిల్లలమర్రి పినవీరభద్రుడు
దుర్యోధనుని సోదరి పేరు ఏమిటో తెలుసా?
దుశ్శల
"దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్" అని చెప్పిన కవి యెవరు?
గురజాడ అప్పారావు
హనుమంతుడు లక్ష్మణుని ప్రాణాలు కాపాడటానికి తెచ్చిన పర్వతం పేరేమి?
సంజీవిని పర్వతం
గబ్బిలం - ఖండ కావ్యం రచించిన కవి ఎవరు?
గుర్రం జాషువా
(16-04-07)
కర్ణుడు జన్మించటానికి కుంతిదేవికి వరమిచ్చింది ఎవరు?
సూర్యుడు
వాలి భార్య పేరేమి?
తార
మహాభారతంలో కవచకుండలాలతో పుట్టినది ఎవరు?
కర్ణుడు
రాముని వనవాసం పేరేమి?
పంచవటి
రామాయణంలో బంగారు జింకగా మాయారూపం దాల్చింది ఎవరు?
మారీచుడు
(07-04-07)
బుద్దుడు జన్మస్థలం ఏది?
లుంబిని వనం
మన్మథుని భార్య పేరేమి?
రతీ దేవి
శ్రీ కృష్ణుని పెద్ద భార్య పేరేమి?
రుక్మిణి దేవి
సంపాతి తమ్ముడి పేరేమి?
జటాయువు
శ్రీకృష్ణుడి తండ్రి పేరేమి?
వసుదేవుడు
(24-03-07)
జమదగ్ని కుమారుని పేరేమి?
పరశురాముడు
శ్రీ మహావిష్ణువు శంఖం?
పాంచజన్యం
అర్జునుడు శివుని గూర్చి తపస్సు చేసి పొందిన అస్త్రం పేరేమి?
పాశుపతాస్త్రం.
శ్రీ కృష్ణుని అన్న పేరేమి?
బలరాముడు
యమునా నదీ తీరాన మథురలో ఉన్న వనం పేరేమి?
బృందావనం
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 02-11-2008 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in