telugudanam.com

      telugudanam.com

   

పిల్లల ఆటలు (కొన్ని)

అక్షరంతో పదాలు

ఎంతమంది ఆడవచ్చు : ఎంతమందైనా.
కావలసిన వస్తువులు : పేపరు, పెన్ను.
ఆడే స్థలం : గదిలో ఆడవచ్చు

ఈ గేమ్ వన్ మినిట్ గేమ్. దీనికి కావలసినవి పేపర్ & పెన్. లీడర్ అందరికి పేపర్, పెన్ను ఇచ్చి మీ కిట్టీలో అందరి పేర్లనువరసగా రాయమనండి. లేదా మీరే అన్ని పేపర్స్ లో రాసి సప్లయ్ చేస్తే ఇంకా తేలిక. ఆ పేపర్‌ని ఈ విధంగా సెట్ చేయండి.


ఉదా : కమల అనే మెంబర్ ఉందనుకోండి

పేరు సీరియల్ పేరు సినిమా పేరు
కమల కలిసుందాం రా కార్తీకదీపం
రాధ

అలా అన్ని వరుసగా మీ కిట్టి మెంబర్స్ పేరు మాత్రమే రాసి పేపర్ పంచండి. వన్ మినిట్ ఎవరైతే ఎక్కువ ఫిలప్ చేస్తే వారే విన్నర్.


[ వెనుకకు ]


ఉల్టాపుల్టా గేమ్

ఎంతమంది ఆడవచ్చు : ఎంతమందైనా.
కావలసిన వస్తువులు : పేపరు, పెన్ను.
ఆడే స్థలం : గదిలో ఆడవచ్చు

ఈ గేమ్ కి ముందుగానే అన్ని రడీ చేసుకోవాలి. ఒక పేపర్ కింది విధంగా రాసుకోవాలి.


వ త్రి న రా నవరాత్రి
ప సం ఉ వా ఉపవాసం
నం రం అ త అనంతరం
ణి ది మ వ్య దివ్యమణి
ని జ ధా రా రాజధాని
త వి క్ష ల ణ విలక్షణత
లు టీ రా కు కుటీరాలు
య్యి వు నె ఆ ఆవు నెయ్యి
తీ ల్లె గ మ మల్లెతీగ
త వు ల్ప రు క కల్పతరువు
జ ద పూ పా పాదపూజ
ణి కృ వే ష్ణ కృష్ణవేణి
శ భ క్తి దే దేశభక్తి

పైన చెప్పిన విధంగా మీకు సరిపడ రాసుకొని జిరాక్స్ తీయించాలి. జవాబులు ఉండకూడదు సుమా.

పైన పదాలు గాక మీరు సొంతంగా తయారు చేసుకొని రాసుకోవచ్చు. గేమ్ ఏమిటో అర్థం అయ్యే ఉంటుంది. మనం ఉల్టాపుల్టాగా ఇచ్చిన అక్షరాలని వాళ్ళు వరుస క్రమంలో వ్రాయాలి. అది వన్ మినిట్‌లో ఎవరైతే ఎక్కువ రాస్తారో వారే విన్నర్.


[ వెనుకకు ]


మెదడుకు పదును

ఎంతమంది ఆడవచ్చు : పది మంది
కావలసిన వస్తువులు : 20 రకాల చిన్నచిన్న వస్తువులు, పేపర్లు, పెన్సిళ్ళు, దుప్పటి
ఆడే స్థలం : గదిలో ఆడవచ్చు
ఆటగాళ్ళ వయస్సు : 5 నుండి 7 సం||రాల మధ్య
పోటీ సమయం : 10 నిమిషాలు

ముందుగా 20 రకాల చిన్న చిన్న వస్తువులను ఒక గదిలో ఉంచాలి. పిల్లలందరిని కూర్చోబెట్టి వస్తువులను పరిశీలించమని చెప్పాలి. తరువాత లీడర్ ఆ వస్తువుల మీద దుప్పటి కప్పాలి. వెంటనే పిల్లలు తమ దగ్గర ఉన్న పేపరు మీద పెన్సిల్‌తో తమకు గుర్తున్న వస్తువుల పేర్లు రాయాలి. 10 నిమిషాలలో అందరూ రాయాలి. ఒకరిదాంట్లో ఒకరు చూడరాదు. అన్నీ సరిగ్గా రాసినవారు విజేత.


[ వెనుకకు ]


భాషలో తమాషా

ఎంతమంది ఆడవచ్చు : పది మంది
కావలసిన వస్తువులు : పేపర్లు, పెన్సిళ్ళు లేదా పలకలు, బలపాలు
ఆడే స్థలం : గదిలో ఆడవచ్చు
ఆటగాళ్ళ వయస్సు : 7 సం||రాల వయస్సు వాళ్ళు
పోటీ సమయం : 2 నిమిషాలు

ఎటు నుంచి చదివినా ఒకే అక్షరం వచ్చే పదాలు రాయడం ఇక్కడ పోటీ. తెలుగు, ఇంగ్లీషు పదాలతో కూడ ఈ పోటీ నిర్వహించవచ్చు. రెండునిమిషాల్లో పిల్లలు ఎక్కువ పదాలు రాయాలి.

ఉదా : 'వికటకవి', 'మడమ', 'కనుక', 'పాలుతెలుపా', 'పులుపు', 'జలజ', 'వాలగలవా', 'లతతల', 'మీసాలసామి', 'నాయనా', 'వినమనిమనవి'.

ఇలా తెలుగులో రాయవచ్చు.

ఇంగ్లీషులో కూడ రాయవచ్చు.

ఉదా: NOON, MADAM, MALAYALAM.


[ వెనుకకు ]


వన్, టూ, త్రీ, బస్

ఎంతమంది ఆడవచ్చు : అయిదుగురు
ఆడే స్థలం : ఆరు బయట
ఆటగాళ్ళ వయస్సు : 10 నుండి 12 సం||రాల మధ్య
పోటీ సమయం : 2 నిమిషాలు

ఇందులో వన్, టూ, త్రీ, ఫోర్, ఫైవ్ అని కాకుండా ఒక అంకెను ఎపింక చేసుకుని దాని స్థానంలో 'బస్' అనే మాటను వాడాలి. ఆ అంకె రెట్టింపు సంఖ్య ఎక్కడొచ్చినా అదే పద్దతి. ఉదాహరణకి '5' అంకెను తీసుకోండి. ఈ ఆటలో ఎలాచెప్పాలంటే వన్, టూ, త్రి, 'బస్' ఫైవ్, సిక్స్, సెవన్ 'బస్' ఇంకా 12 తర్వాత 18 తర్వాత అలా 'బస్' వస్తూనే ఉంటుంది. అర్థమైందిగా, ముందు కాస్త సులభంగా అనిపించినా, అంకెలు చెబుతూ వెళ్ళినకొలది 'బస్' కాస్త ఇబ్బంది పెడుతుంది. దాన్ని అధిగమించి చెబితేనే గెలిచినట్లు.


[ వెనుకకు ] [ ముందుకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: