telugudanam.co.in

      telugudanam.co.in

   

ఓటమే గెలుపుకు నాంది

'ధామస్‌ ఆల్వా ఎడిసన్‌' ఎలక్ట్రిక్‌ బల్బుతో పాటు ఎన్నో ప్రత్యేకమైన, విశిష్టమైన పరిశోధనలు జరిపిన సుప్రసిద్ధ శాస్త్రవేత్త, ఎలక్ట్రిక్‌ బల్బు ఫిలమెంట్‌ను రూపొందించేందుకు ఆయన దాదాపు రెందు వేల పదార్ధాలను పరిశీలించి, ప్రయత్నించారు. కాని వాటిలో ఏ పదార్ధమూ సంతృప్తికరమైన ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో నిరాశ నిస్పృహలు ఆవరించిన ఎడిసన్‌ శిష్యుడు(యువ శాస్త్రవేత్త), "మన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరులా నీరుగారిపోయాయి. మనం ఏమీ నేర్చుకోలేకపోయామ" అని విసుక్కున్నాడు.

అతని నిరాశను, నిర్వేదాన్ని అర్ధం చేసుకున్న ఎడిసన్‌, "లేదు. మన సుదీర్ఘ ప్రయత్నంలో ఎంతో నేర్చుకున్నాం. ఒక మంచి ఎలక్ట్రిక్‌ బల్బును తయారు చేసేందుకు ఈ రెండువేల పదార్ధాలలో ఏ ఒక్కటీ సరిగ్గా పనిచేయదని మనం తెలుసుకున్నాం కదా!" అన్నాడు.

ఓటములే అతిపెద్ద గెలుపుకు మెట్లు, బాటలు అని నమ్మిన ఎడిసన్‌, ఆ తరువాత కొన్ని రోజులకే మొదటి ఎలక్ట్రిక్‌ బల్బును తయారుచేసి ప్రపంచాన్ని వెలుతురులో నింపాడు. ఆయనలాగే మనమంతా ఓటమికి కుంగిపోకుండా, ఆ ఓటమి ఎందుకు వచ్చింది? దానికి కారణాలు ఏమిటి? ఓతమి చెందకుండా ఉండాలంటే ఏం చేయాలి? అని ప్రశ్నలకు సంధించుకుంటే గెలుపు బాటలో ప్రయాణించడం అత్యంత సులభం.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: