|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం | మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
కుమారీ శతకము
శ్రీ భూ నీళా హైమవ
తీ భారతు లతుల శుభవతిగ నెన్నుచు న
త్సౌభాగ్యము నీ కొనcగcగ
లో భావించెదరు ధర్మలోల కుమారీ!
భావం: కుమారీ! మంచి నడవడిక కలిగిన, లక్ష్మీ, భూదేవి, నీళా, హైమావతి, భారతి, నీకు సకల శుభాలు కలిగిస్తారు. నిన్ను కాపాడుతారు.
చెప్పెడి బుద్ధులలోపలc
దప్పకు మొకటైన సర్వ ధర్మములందున్
మొప్పొంది యిహపరంబులc
దప్పింతయు లేక మెలగcదగును కుమారీ!
భావం: నేను చెప్పే నీతులు సరిగా అనుసరించు. సర్వ ధర్మాలకు న్యాయం చేయి. ఇహపరాలలో నీతిగా జీవించు.
ఆటలc బాటలలో నే
మాటయు రాకుండc దండ్రి మందిరమందున్
బాటిల్లుc గాcపురములో
వాట మెఱిcగి బాల! తిరుగ వలయుc కుమారీ!
భావం:
తెచ్చినc దేకుండిన నీ
కిచ్చిన నీకున్న మగని నెగ్గాడకుమీ
యెచ్చెము నీపైc దేలును
రచ్చల కామాట లెక్కు రవ్వ కుమారీ!
భావం:
పతిపాపపుc బనిc జెప్పినc
బతిమాలి మరల్పవలయుc బతి వినకున్నన్
హిత మనుచు నాచరింపుము
మతిలోపల సంశయంబు మాని కుమారీ!
భావం:
తిట్టిన దిట్టక, కొట్టిన
గొట్టక, కోపించెనేనిc గోపింపక, నీ
పుట్టినయింటికిc బాదము
పెట్టినయింటికని వన్నె పెట్టు కుమారీ!
భావం:
దబ్బరలాడకు కదిమిన
బొబ్బలు పెట్టుకుము మంచి బుద్ధిగలిగి యెం
దెబ్బెఱికముc బూనక కడుc
గొబ్బునc జిత్తమున వానిc గూర్పు కుమారీ!
భావం:
జపములు, గంగాయాత్రలు,
దపములు, నోములును, దాన ధర్మంబులు, పు
ణ్యపురాణము పతిభక్తికి
నుపమింపను సాటిరాక యుండు కుమారీ!
భావం:
ఇరుగు పొరుగిండ్ల కైనను
వరుcడో, కాకత్తగారొ, వదినెయొ, మామో
మఱcదియొ సెల విడకుండcగc
దరుణి స్వతంత్రించి పోవc దగదు కుమారీ!
భావం:
కూతురు చెడుగై యుండిన
మాతది తప్పన్నమాట మది నెఱుగుదుగా
నీ తలిదండ్రులకు నప
ఖ్యాతులు రానీయcగూడ దమ్మ! కుమారీ! 10
భావం:
అమ్మకు రెం డబ్బకు రెం
డిమ్మహిc దిట్టించు కూcతు రెందుకు ధర నా
ద్రిమ్మరి పుట్టిక పోయిన
నిమ్మళమని యండ్రు జనులు నిజము కుమారీ!
భావం:
తన బావల పిల్లల యెడc
దన మఱcదుల పిల్లలందుc దనపిల్లల కం
టెను మక్కువ యుండవలెన్
వనితల కటులైన వన్నె వచ్చుc కుమారీ!
భావం:
ధనవంతుcడైన యప్పుడుc
పెనిమిటి చిత్తం బెఱింగి పెండ్లాము మెలం
గును లేమి మెలcగ నేర్చిన
వనితకు లోకమున వన్నె వచ్చుc కుమారీ!
భావం:
కడుపారc గూడుc గూరలు
దొడవులు వస్త్రములు మిగుల దొరకవనుచుc దా
వడితనమునc బెనిమిటితో
నెడcబాసి చరింపcగూడదెపుడు కుమారీ!
అత్తపయిన్ మఱcదలిపయి
నెత్తిన కోపమున బిడ్డ నేడ్పించుటకై
మొత్తినc దనకే కీడగుc
జిత్తములో దీనిcజింత సేయు కుమారీ!
మృతియైనను బ్రతుకైనం
బతితోడనె సతికిcజెలc బతిబాసిన యా
బ్రతు కొక బ్రతుకా? జీవ
న్మృతి గాక వధూటి కెన్న నిదియుc గుమారీ!
జీవములు భర్తపద రా
జీవములని చిత్తమందుcజింతించిన ల
క్ష్మీవల్లభు చరణంబుల
సేవ లతాంగులకు నెమc గుమారీ!
తన కెంత మేలు చేసిన
మనమున కింపైన పనులc మనలిన దాసీ
వనితల కెన్నటికైనం
జనవిచ్చి మెలంగరాదు జగతిc గుమారీ!
కులదేవతలకుc బెట్టిన
పొలుపునc దనయింటియాడు బొట్టెల కెల్లం
గలమాత్ర మొసcగకుండినc
గలcత పొడము దాన మేలు గాదు కుమారీ!
బద్ధకము సంజనిద్దుర
వద్దుసుమీ దద్దిరంబు వచ్చున దాసన్
గద్దింతు రింటివారలు
మొద్దందురు తోడివారు ముద్దు కుమారీ! 20
భావం:
వేకువజామున మేల్కని
పైకి వెడలి వచ్చి ప్రాచి పనిcదీర్పవలెన్
లేకున్నcదెల్లవాఱిన
లోకులు నవ్వుదురు సభల లోనc గుమారీ!
భావం: తెల్లవారుజామున నిద్ర లేవలి. ఇంటి పనులు చేసుకోవాలి. అలాకాక పొద్దెక్కిన తరువాత లేస్తే, విన్నవారు నిన్ను చూసి నవ్వుకుంటారు.
తలవాకిట నెల్లప్పుడు
నిలువcగ రా దెప్పుడెంత నిద్దురయైనన్
మెలకువ విడరాదు సుమీ
తల నడచుచు విప్పికొనుట తగదు కుమారీ!
భావం: వీధి గుమ్మం ముందు నిలుచోరాదు. మొద్దు నిద్రలో మెలకువగా ఉండాలి. నడిచేప్పుదు తల వెంట్రుకలు విప్పరాదు. ఈ పని మంచిది కాదు.
వారికి వీరికిc గలిగెను
గోరిన వస్తువులు మాకు గొదవాయె నటం
చూరక గుటకలు మ్రింగుట
నేరముగాc దలcపవలయు నెలcత కుమారీ!
భావం:
నడకలలో నడుగుల చ
ప్పుడు వినcబడకుండవలయు భువి గుంటలు క
న్పడరాదు మడమనొక్కులc
బడcతులమర్యాద లెఱిగి బ్రతుకు కుమారీ!
భావం:
నవ్వంగ రాదు పలుమఱు
నవ్వినc జిఱునవ్వు గాని నగరా దెపుడున్
గవ్వలవలె దంతంబులు
జివ్వునc గానంగc బడెడి జాడc గుమారీ!
భావం: పలు మారులు నవ్వరాదు, నవ్వితే చిరునవ్వు మాత్రం చాలు, పళ్లన్నీ కనిపించే విధంగా ఫకాలున నవ్వరాదు.
నోరెత్తి మాటలాడకు
మాఱాడకు గోపపడిన మర్యాదలలో
గోరంత తప్పి తిరుగకు
మీరకుమీ యత్తపనుల మెలcగు కుమారీ!
భావం: ఎవరితోనైనా బిగ్గరగా మాట్లాడకు. ఇతరులు కోపగిస్తే, ఏమీ అనకు. పెద్దలు చెప్పిన పనులు శ్రద్ధగా చేయి.
తల్లిదండ్రు లన్నదమ్ముల
తులcదూగగ పసిడిcతోనైనను వా
రలయింట సతత ముండుట
వెలcదికి మర్యాదగాదు వినవె కుమారీ!
భావం: తల్లిదంద్రులు, అన్నదమ్ములు, బంగారంతో తులతూగేవారైనా, వారి ఇంట ఎక్కువ కాలం ఉండావద్దు. ఇది ఇల్లాలికి మంచిది కాదు.
పోకిళ్ళు పోక పొందిక
నాకులలోcబిందెరీతి నడcకువగా నెం
తో కలసిమెలసి యుండిన
లోకములోపలను దా వెలుంగుcగుమారీ!
భావం: ఎచ్చులకు పోకుండా, ఆకు చాటు పిందెలా అణుకువువతో ఉండాలి. అందరితో కలిసి ఉంటే లోకంలో మంచి పేరు వస్తుంది.
కడుc బెద్దమూటc దెచ్చినc
జెడుగై వర్తించెనేని జిరతర చింతం
బడుదురు తలిదండ్రులు తో
బడుచులు సోదరులు నింద బడుదురు కుమారీ!
భావం: అత్తవారింటికి నీవు ఎంత పెద్ద మూటతో వచ్చినా, చెడు మార్గంలో ప్రవర్తిస్తే, నీ తల్లిదండ్రులు, సోదరులు సంతోషింపరు. అది నీకు చెడుపేరు తెస్తుంది. నీ ఆత్మీయులు నిందలపాలవుతారు.
కొన్నాళ్ళు సుఖము కష్టము
కొన్నాళ్ళు భుజింపకున్నcగొరగాదు సుమీ
పున్నమదినముల వెన్నెల
యెన్నంగ నమాసలందు నిరులు కుమారీ! 30
భావం: కొన్నాళ్లు సుఖం, కొన్నాళ్లు కష్టం, ఏవిధముగా అంటే - పౌర్ణమి, రోజులలో వెన్నెల, అమావాస్య రోజులలో చీకటి వలె ఉంటుంది. లేని దినాలలో కష్టంగా భావించక భావించక, ఓర్పుతో ఉంటే సుఖం కలుగుతుంది.
పొంతపని సేయకెన్నcడు
పంతంబులు పలుకcబోకు ప్రాజ్ముఖముగ నీ
దంతంబులు దోమకు మే
కాంతంబులు బయలుపరుప కమ్మ కుమారీ!
భావం: కలిసి మెలిసి పని చేయకుండా, ఇతరులతో తగవులాడవద్దు. సూర్యోదయానికి ఎదురుగా ముఖం కడుగ వద్దు. నీ రహస్యాలు ఇతరులకు చెప్పవద్దు.
వేళకోళంబులు, గ
య్యాళితనంబులును జగడ మాడుటలును గం
గాళీపోకలు గొండెము
లాలోచించుటయుc గూడ వమ్మ కుమారీ!
భావం: బట్టలు, ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. సంపద కలవారైనా పరిశుభ్రత పాటించకపోతే, పేదవారు ఔతారు.
మాసినతల మాసిన యిలు
మాసిన వలువలు దరిద్రcమార్గంబులు నెమ్మ్
తేసి ధనవంతులైనను
గాసిల్లుదు రల్పదశల గ్రాగి కుమారీ!
భావం:
విసువగు పని తగిలినయెడc
గసరకు సేవకుల మిగుల గాంతునితోడన్
రొసరొస పూసకు మాడకు
మసత్యవచనంబు లెన్నcడైన కుమారీ!
భావం: ఏదైనా పని ఉన్నప్పుడు విసుగు చెందరాదు, పనివారిని కసరరాదు, భర్తతో కలహించరాదు, అబద్ధాలు ఎప్పుదూ చెప్పరాదు.
చెప్పిన జెప్పక యుండిన
దప్పక సేయంగవలయు దనపనుఇలెల్లన్
మెప్పొదవcగాను లేదా
ముప్పొదవుగాదె యెందు ముద్దు కుమారీ!
భావం: ఒకరు చెప్పినా, చెప్పకున్నా, తాను చేయవలసిన పనులు చేయాలి, చేయకపోతే తనకే కలుగుతుంది.
దీపము వెలిగించెడిచో
జీపురుపుడ కుంచవలయుcజేతుల నేతిం
బాపము పాలౌదువు మది
లోపల నిది తలప వలయు.. రూఢి కుమారీ!
భావం: దీపం వెలిగించే సమయంలో చీపురు పుడకను ఉపయోగించు. లేనిచో చేతులకు అంటుకున్న నేయితో కష్టాల పాలవుతావు. ఈ విషయం గమనించాలి.
ఆపదలకోర్చి సంపద
లాపయి భోగింపు మనెడి హర్షోక్తుల నీ
లోపలcదలంచుచు లాంతరు
దీపము చందమున వెలుcగ దివురు కుమారీ!
భావం: లాంతరులో దీపం కదలక ఉన్నట్లు, కష్టాలను తట్టుకుని తరువాత, సుఖ సంతోషాలను అనుభవింపవచ్చును.
సరకులయెడజాగ్రత్తయు
జురుజుపనులయందు భక్తి సుజనులయందున్
గరుణ యనాథుల యెదలం
దరుణికిcజెలువారవలయు ధరణి కుమారీ!
భావం: స్త్రీకి వస్తువులందు జాగ్రత్తగా ఉండాలి, చేసే పనులలో చురుకుదనం ఉండాలి, మంచివారిపై భక్తి కలిగి ఉండాలి, పేదవారి పట్ల కరుణ కలిగి ఉండాలి.
తన కడుపు కట్టుకొనియై
నను జుట్టమునకు బెట్టి నను గిర్తీవహిం
చును భుక్తిముక్తు లబ్బును
దన కెవ్వరు సాటిరారు ధరణి కుమారీ!
భావం: ఇంటికి వచ్చిన అతిధికి, నీ ఆకలి చంపుకొని అయినా అన్నం పెట్టాలి. అపుదు ఇహ పరాలలో భక్తి, ముక్తి లభిస్తాయి. అలాటి వారికి ఎవరూ సాటిరారు.
చెప్పకు చేసిన మేలు నొ
కప్పుడయినcగాని దాని హర్షింపరుగా
గొప్పలు సెప్పన నదియును
దప్పేయని చిత్తమందు దలcపు కుమారీ! 40
భావం: ఇతరులకు ఎదైనా మేలు చేస్తే బయటకు చెప్పవద్దు, దానిని ఎవరూ హర్షించరు, గొప్పలు చెప్పుకొనుట కూడదు. అది తప్పే అని మనసులో తలచాలి.
ఎంగిలి పరులకుc బెట్టకు
కంగున మ్రోయంగ నీకు కాల్మెట్టియలన్
బంగారు లాభముండిన
దొంగతనము సేయుబుద్ధిcదొలcచు కుమారీ!
భావం: నీ ఎంగిలి ఎవరికీ పెట్ట వద్దు, మట్టేల మోతలు వినపదేలా నడవ వద్దు, లాభం ఉన్నా, బంగారమైనా దొంగిలించాలి అనుకోకు.
చెడుగనిపించుకొనుటకున్
గడియైననుcబట్టకుండుc గాంతలలో నె
క్కుడు గుణవతి యనిపించెడు
నడవడి నేర్చుటయె కడు నంబు కుమారీ!
భావం: దుర్మార్గుదు అనిపించుకోడానికి, ఒక్క గడియ చాలు. స్త్రీలలో గుణవంతురాలు, అనిపించుకోవాలంటే చాల కష్టం.
తనకెంటెc బేదవాండ్రం
గని యంతకుcదనకుమేలు గా యనవలయున్
దనకంటె భగ్యవంతులc
గని గుటకలు మ్రింగ మేలు గాదు కుమారీ!
భావం: తనకన్న పేదవారి చూచి, వారికంటే తాను ఎంతో నయమని భావించాలి, ధనవంతుల చూచి, నాకు ధనం లేదే అని విచారించరాదు.
ఎంతటి యాకలి గలిగిన
బంతిన గూర్చుండిముందు భక్షింపరు సా
మంతులు బంధువులును నుసు
మంతైనను జెల్లదందు రమ్మ కుమారీ!
భావం: పంక్తిలో భోజనానికి కూర్చుంటే, ఎంత ఆకలేసినా ముందు తినరాదు. అలా తింటే బంధువులు తిండిపోతు అనుకుంటారు.
కోపముల నప్పుడాడ ని
రూపించిన మాటకొన్ని రోజుల చనినం
జూపెట్టుదునని శాంతము
లోపcగొనవలయు ధర్మ లోల కుమారీ!
భావం: కోపం వచ్చినపుడు నిగ్రహం చూపాలి. కోపంలో చెప్పబోయే మాతను తర్వాత తెలియచేస్తానని, మనసును శాంత పరచుకోవాలి. దీన్ని పాటించాలి.
విరుగబడు నడువcగూడదు
పరుల నడకలెన్ని తప్పు బట్టcజనదు ని
ష్టరములు వచింపcగూడేఉ
కఱపcగవలె మేలు చేలు గలదు కుమారీ!
భావం: నడుం విరుచుని నదవరాదు. ఎవరైనా అలా నదిస్తే ఎగతాళి చేయకు. సరిగా నదవమని మంచిగా చెప్పు. నిష్ఠూరాలు పలకరాదు.
సరూకులు బట్టలు వన్నెల
కెరవులు తేcదదగదు తెచ్చె నేనిసరకు ల
క్కర దీర్చుకొనిన వెంటనే
మరలింపకయున్నcదప్పు మాట కుమారీ!
భావం: వస్తువులు, నగలు, బట్టలు ఇతరులవి వాడేందుకు తేకూదదు. ఒక వేళ తెచ్చినా వెంటనే ఇచ్చివేయాలి. లేకుంటే తప్పు అవుతుంది.
కలహపడు నింట నిలువదు
కలుముల జవరాలు గానcగలకాలం బే
కలహములు లేక సమ్మతి
మెలగcగా నేర్చేదవేని మేలు కుమారీ!
భావం: తగవులు పడే ఇంట లక్ష్మీదేవి నిలువదు. కాబట్టి ఇంట్లో తగవులు రాకుండా చూడు బాగా మెలగడం మంచిది.
గొప్పదశ చచ్చెననుచు నొ
కప్పుడయిన గర్వపడకు మది తొలగించినచో
జప్పట్లు జఱతు రందఱు
దప్పని దండించు దండ ధరుcడు కుమారీ!
భావం: అదృష్టం వలన సంపద కలిగితే గర్వపదరాదు. అలా గర్విస్తే సంపద పోవచ్చు. అపుడు పరులు చూసి నవ్వుతారు.
గురుశుక్రవారముల మం
దిరగేహళులందు లక్ష్మి తిరముగ నిలుచుం
గరిగరిక నలికి మ్రుగ్గిడి
గురుభక్తి మెలంగcబాయు గొదువ కుమారీ! 50
భావం: గురు, శుక్రవారాలు ఇల్లు శుభ్రపరచి, ముగ్గుపెట్టు. గడపలకు పసుపు రాయి. ఇలా చేసినవారింట లక్ష్మి నిలకడగా ఉంటుంది.
అపకీర్తి బొందుట క
ష్టపుcబని గాదొక్క గడియ చాలును కీర్తి
న్నిపుణత వహింపవలయును
జపలగుణములెల్ల బాసి చనగ కుమారీ!
భావం: చెడు పేరు సంపాదించేందుకు, ఒక క్షణకాలం చాలు. మంచిపేరు తెచ్చుకోవాలంటే, నిలకడ లేని పనులు మానాలి.
సుమతియును చంద్రమతియును
దమయంతియు జానకియును ద్రౌపదియును బ
న్నములం బడి పతిభక్తిం
గ్రమమున నడపుటలుతలcపcగాదె కుమారీ!
భావం: సుమతి, చంద్రమతి, దమయంతి, జానకి, ద్రౌపది మొదలైన వారు, ఎన్ని కష్టాలు కలిగినా పతిభక్తితో ఉన్నారు. నీవూ అలా ఉండేలా ఆలోచించు.
దానములు ధర్మకార్యము
లూనంగాcగలిగినంత యుక్త క్రియలన్
మానవతుల కిది ధర్మము
గానెఱింగి యొనర్పవలయుcగాదె కుమారీ!
భావం: దాన ధర్మాలు ఎంత చేస్తే అంత మంచిది. ఆడవారు ఇది మంచి పని, అని తెలుసుకుని నడవాలి.
శ్రమయెంత సంభవించుఇన
క్షమ మఱువcగరాదు ధరణి చందంబున స
త్యమున బ్రర్తించి యా
రమణియె లోకంబునందు రమణి కుమారీ!
భావం: ఎన్ని కష్టాలు వచ్చినా, భూదేవిలా, ఓర్పుగా ఉండాలి. ధర్మ బద్ధంగా నదచిన మహిళను మంచిదంటారు.
ఈరీతిc దిరుగ నేర్చిన
నారీమణీ కీర్తిబొందు నరలోకమునం
దూఱులు తొలంగిపోవును
ఘోర దురిత సంఘమెల్లc గుందు కుమారీ!
భావం: ఇంతకు ముందు చెప్పిన విధంగా, ధర్మబద్ధంగా నడుచుకుంటే నిన్నెవ్వరూ నిందించరు. నీకు మంచి పేరు వస్తుంది. చెడు తొలగిపోతుంది. ఈ లోకంలో, పైలొకంలో సుఖపదతావు.
కులమున విత్తంబున వి
ద్యలను మదం బుద్ధవించు నాయా పెంపుల్
దలపోయ మరలు నిది హృ
జ్జలజంబునcదలపవలయు సతము కుమారీ!
భావం: ధనం వలన, విద్య వలన, కులం వలన, గర్వం రావచ్చు. తన కంటే గొప్పవారున్నారని తెలిస్తే గర్వం తగ్గుతుంది. కనుక అలోచించి మసలుకోవాలి.
బరిజనము లాచరించెడి
దురితంబున గ్రోధగుణము దోచెడి నధిక
స్పురణన్ క్షమ గైకొని నం
దఱు నది యెఱింగి మెలcగ దగు కుమారీ!
భావం: నీ సేవకులు చేసే పనుల వలన కోపం రావచ్చు. క్షమాగుణం గుర్తుకు తెచ్చుకుని శాంతించు. ఇది మంచిపని అని తెలుసుకుని మెలగాలి.
బహుకష్టములం బొందక
మహిలో సమకూడcబోదు మానవజన్మం
బహహ యీ జన్మంబున
నిహపరములం గొనెడు జాడ లెఱుంcగు కుమారీ!
భావం: ఎన్నో పుణ్యాలు చేసుకుంటేగాని, మానవ జన్మ లభించదు, కనుక ఈ జన్మలో పాప పుణ్యాలు తెలుసుకో, ముక్తి కొరకు మార్గం చూడు.
దృశ్యపదార్థము లెల్లను
సశ్యములని తలcపకుండి నను లోపంబౌ
దృశ్యంబున నస్థిరత న
నశ్యము చిత్తమునcదలప వలచె కుమారీ!
భావం: మనకు కనుపించే ప్రతిదీ నశించేదే, కనుక వస్తువులపై ప్రీతి వదిలి జీవించు.
ఎన్నాళ్ళు బ్రతుకcబోదురు
గొన్నాళ్ళకు మరణదశల గ్రుంగుట జగమం
దునంట్టివారి కందఱి
కిని హితము సతము మంచి కీర్తి కుమారీ! 60
భావం: ఈ భూమిపై పుట్టినవారు, ఎన్నాళ్లు జీవిస్తారు, కొంతకాలమయ్యాక ఎలాగూ మరణిస్తారు. మనం చేసే మంచి పనుల ద్వారా కీర్తి తెచ్చుకోవాలి.
నేలన్ వ్రాలిన పత్రము
లోలిం జోడించి మడచు చుండిన యవియున్
బోలcగ సున్నపుటాకులు
దూలించు దరిద్రదశలcదోcగ కుమారీ!
భావం: నేలపై రాలిన తమలపాకులకు, సున్నం రాసినా అవి పనికిరావు, వాటిని ఉపయోగిద్తే దరిద్రం కలుగుతుంది.
మాత్సర్య మొదపు సత్యము
హృత్సరసీజమున లేబు నెల్లప్పుడుcదా
సత్సేవయందుcదిరిగిన
మాత్సర్య మణంగుcదెలిపి మనుము కుమారీ!
భావం: కోపం వలన న్యాయం, ఆలోచన నశిస్తాయి, మంచివారి స్నేహం కోపాన్ని పోగొడుతుంది. ఐతే తెలిసి మసలుకోవాలి.
తుడుపు దుమారమ్మును జెరు
గుడు ధూళియు మేషరజముcగూడదెపుడు మైc
బడ నెఱింగి తిరుగ నేర్చిన
బడతుల మర్యాద లెఱింగి బ్రతుకు కుమారీ!
భావం: ఇల్లు ఊడ్చేప్పుడు రేగే దుమ్ము, చెరిగేప్పూ వచ్చే దుమ్ము, మేక కాళ్ల ధూళి, మనపై పడకుండా చూడు.
ఇద్దరు గూడుక యొకచో
నొద్దిక మాటాడుచుండ నొదిగి యొదిగి యా
యొద్దకుcజనగూడదు తన
పెద్దతనం బెల్ల నణcగ బెట్టుc కుమారీ!
భావం: ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటూ ఉంటే, ఆ మాటలు నీవు వినకు. అలా చేస్తే, నీ పెద్దరికం మట్టికరుస్తుంది.
మఱవవలెc గీడు నెన్నcడు
మఱువcగారాదు మేలు మర్యాదలలో
దిరుగవలె సర్వజనములం
దరి బ్రేమ మెలంగవలయు ధరణి కుమారీ!
భావం: ఈ లోకంలో ఒకరు కీడు చేస్తే మరచి పోవాలి, కాని, మేలు చేసిన వారిని మరువరాదు, జనులతో మర్యాదతో, ప్రేమతో మెలగాలి.
దీపముల నీడ మానవ
రూపంబుల నీడ శనితరుల నీడను ఖ
ట్వాపాదితమగు నీడల
నేపట్టున నిలువcగూడ దెపుడు కుమారీ!
భావం: దీపం నీడలో, మనిషి నీడలో, మంచం, తాడిచెట్టు నీడలో, ఏ సమయంలోనూ నిలువరాదు.
ఆకులొకిన్నియు జేకొని
పోక నమిలి సున్నమడుగc బోయినcగని యీ
లోకులు నవ్వుదురు సుమీ
కై కొనవలె మంచినడత ఘనత కుమారీ!
భావం: ఆకులు చేత పట్టుకుని, వక్కలు నములుచు, సున్నం అడిగే వారిని చూసి, లోకులు నవ్వుతారు, అందువలన మంచి పధతులు అలవర్చుకోవాలి.
కొనగోట వ్రేలు వెండ్రుక
లను జాఱెడు నీళ్ళకుండ లను ముంతల వా
డినవెంక్స్ మిగులు నీళ్ళను
జనదండ్రు దరిద్రమెందు కుమారీ!
భావం: కొనగోటి నుంచి జాలువారే నీళ్లు, తల వెంట్రుకల నుంచి జాలువారే నీళ్లు, కుండాలలో వాడిన మిగులు నీరు వాదరాదు. దీన్ని దరిద్రం అంటారు.
వాణియు శర్వాణియు హరి
రాణియు వాక్కునను మై నురంబున నుంటల్
రాణcదిలకించి మదిలో
బాణిగ్రాహియెడ నిల్పు భక్తి కుమారీ!
భావం: సరస్వతీ దేవి వాక్కునందు. పార్వతీదేవి శరీరంలో సగ భాగంగాను, లక్ష్మీదేవి వక్షంపై ఉండి, తమ భర్తలను ఎలా సేవిస్తున్నారో, నీవు అలాగే భర్తకు తోడుగా ఉండి, భక్తితో సేవ చేయాలి.
మఱదండ్రు వదినె లత్తలు
మఱcదులు బావలు కొమాళ్ళు పెద్దలు రా
నుఱవడిc బీటలు మంచము
లరుగులు దిగుచుండవలయు నమ్ము కుమారీ! 70
భావం: అత్తమామలు, మరదలు, బావలు, వదినలు, మరదళ్ళు, అరుగుపై కూర్చున్నవారు వెంటనే లేవడం మర్యాద.
పతి కత్తకు మామకు స
మ్మతిగాని ప్రయోజనంబు మానcగలవయున్
హిత మాచరింపవలయును
బ్రతుకున కొక వంక లేక పరcగుc కుమారీ!
భావం: భర్తకు అత్తమామలకు ఇష్టంలేని పనులు మానాలి. వారికి మంచి కలిగించే పనులే చేయాలి. నీ ప్రవర్తనలో లోపం లేకుండా చూడు.
మగని ప్రియ మబ్బె ననుచును
దెగ నీలిగి యింటివారిని దిగcద్రొక్కుచు దుం
డగురాలై తిరిగిన సరి
మగువలలో నిదియె తప్పుమాట కుమారీ!
భావం: భర్త తనను ప్రేమతో చూస్తున్నాడని, ఇంట్లో వారిపై పెత్తనం చేయద్దు. అలా చేస్తే సాటివారు నీది తప్పు అనుకుంటారు.
ఇంటగలc గుట్టు నీపొరు
గింట రవంతైనc దెలుప నేగళు దానన్
గంటనపడి నీవారలు
గెంటించెడ తిల్లు వెడలcగినుక కుమారీ!
భావం: ఇంటి గుట్టు పొక్కనీయకు, పొక్కనీస్తే అవి గోరంతలు కొండంత అవుతాయి. నీ అత్తమామలు, భర్త నిన్ను ఇంటి నుంచి గెంటుతారు. ఇది తెలిసి మసలుకోవాలి.
ఇక్కడి దక్కడ నక్కడి
దిక్కడ జెప్పినను వారి కిద్దరికిcబగల్
పొక్కినcగల చేడియల
మ్మక్కా యిడుమళ్ళమారి యడ్రు కుమారీ!
భావం: ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెప్పి, తగవులు పెంచే వారిని కయ్యాలమారీ అంటారు.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in