|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం | మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
కవితలు
తేనెకన్న మధురం రా, తెలుగు ఆ
తెలుగుదనం మా కంటి వెలుగు
తెలుగుగడ్డ పోతుగడ్డ ఎంత పచ్చన, మా
తెలుగు గుండెలో స్నేహము ఎంత చెప్పన!
మన పొలాల శాంతి పులుగు ఎంత తెల్లన, మన
తరతరాల కథను పాడు గుండె ఝల్లన
పాటుపడిన వాళ్ళకే లోటు లేదను
చాటి చెప్పు తల్లికదా తెలుగుతల్లి
లలితకళలు సంగీతం సాహిత్యం
తెలుగు తల్లి జీవితాన దినకృత్యాలు
గత చరిత్ర మన చరిత్ర ఎంత ఖ్యాతి!
గర్వించదగ్గ జాతి తెలుగు జాతి!
అయినా గతంకన్న భవిష్యత్తు ఆశాజనకం
ఆ భావికొరకు ధరించాలి దీక్షాతిలకం.
కన్నదేశం వదలి, ఉన్న దేశానికి వస్తే
ఉన్నవాళ్ళంతా కానివాళ్ళే !
కారు వున్నా, కాసు వున్నా,
ఊరు గాని ఊరులోన సుఖం సున్న !
కారు ఏసి, ఇల్లు ఏసి,
వళ్ళు మాత్రం వేడివేడి
ఊరు గొప్పది, పేరు గొప్పది,
ఉనికి మాత్రం ఉత్తది !
సంవత్సరాలుగా సహచరులే
సంబంధాలు మాత్రం అరకొరలే !
ముఖం చూడ సుపరిచతమే
మనిషి మాత్రం అపరిచితుడే !
ఎదురుపడితేనే హాయి, భాయి,
ఎప్పుడు కలవాలి చేయి చేయి !
ఎప్పుడు కావాలి భాయి భాయి !
ఇక్కడి ఇళ్ళే బంధిఖానాలు,
మూసిన వాకిళ్ళు, మనసుకు సంకెళ్ళు !
భార్యాభర్తలు కూడా, దూరపు బంధువులే !
ఎవరి లెక్కవారికి, ఎవరి తిక్కవారిది !
నవ్వు కృత్రిమం, నడత కృత్రిమం !
అంతా అసహజత్వం, అంతా యాంత్రికం !
రోజంతా కంప్యూటర్‌తోనే కబుర్లు
"నువ్వూ యంత్రానివే" అన్నట్లు దాని విసుర్లు!
ఆత్మీయంగా మాట్లాడేవాళ్ళ కోసం
ఆత్రంగా చూడటం,
తెరచిన వాకిళ్ళ కోసం
అలుపెరగక వెదకడం
అలవాటయిన ఈ కళ్ళు
ఆలోచిస్తాయి రేయింబవళ్ళు !
ఎంతగా కలిసిపోదామన్నా,
పరాయివాడినన్న భావన !
చుట్టూ వందలమంది వున్నా
ఎవరూ లేని ఒంటరితనం !
నా దేశాన్ని నాకు దూరంచేసిన,
నా రూపాయి అవిటితనం !
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 04-11-2008 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in