www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

నీతి పద్యాలు

తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు

తవిలి మృగ తృష్ణ లో నీరు త్రావ వచ్చు

తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు

చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు!

చెలిమియు, పగయును, తెలివియు

కలకయు, ధర్మంబు, పాపగతియును, పెంపున్

తులువతనంబును వచ్చును

పలుకుబడిన కాన, పొసగ పలుకగ వలయున్!

దొంగ పాలు కాదు దొడ్డ కీర్తిని దెచ్చు

పరమ సౌఖ్యమిచ్చు భద్రమిచ్చు

యాచకునకు నీయ నావంత తరుగదు

విద్య బోలు ధనము పృధివి గలదె!

తరువు లతిరస ఫలభార గురుత గాంచు

నింగి వ్రేలుచు అమృత మొసంగు మేఘు

డుద్ధతులు గారు బుధులు సమృద్ధి చేత

జగతి నుప కర్తలకు నిది సహజ గుణము!

తెలియని మనుజుని సుఖముగఁ

దెలుపం దగు సుఖతరముగ దెలుపఁగ వచ్చున్

దెలిసినవానిం దెలిసియుఁ

దెలియని నరుఁదెల్ప బ్రహ్మ దేవుని వశమే

విద్య నిగూఢగుప్తమగు వితము రూపము పురుషాళికిన్

విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశబంధుడున్

విద్య విశిష్టదైవతము విద్యకు సాటి ధనంబు లే దిలన్

విద్య నృపాల పూజితము విద్యనెరుంగనివాడు మర్యుడే.

సత్యసూక్తి ఘటించు, ధీ జడిమ మాంచు,

గౌరవ మోసంగు జనులకు గలుష మడచు

గీర్తి బ్రకటించు జిత్తవి స్ఫూర్తి జేయు

సాధుసంగంబు సకలార్ధసాధనంబు.

దానము భోగము నాశము

పూనికతో మూడుగతులు భువి ధనమునకున్

దానము భోగము నెరుగని

ధీనుని ధనమునకు గతి తృతీయమొసగున్

తెలివి యొకింత లేని యెడఁ దృప్తుఁడనై కరిభంగి సర్వమున్

దెలిసితి నంచు గర్వితమతిన్ విహరించితిఁ దొల్లి యిప్పుడు

జ్జ్వలమతు లైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై

తెలియనివాఁడ నై మెలఁగితిం గతమయ్యె నితాంతగర్వమున్.

ఆకాశంబుననుండి శంభుని శిరం బందుండి శీతాద్రి, సు

శ్లోకంబైన హిమాద్రినుండి భువి, భూలోకంబునందుండి య

స్తోకాంభోధిఁ బయోధినుండి పవనాం ధోలోకముం జేరె గం

గాకూలంకష పెక్కు భంగులు వివేకబ్రష్ట సంపాతముల్.

భూషలు గావు మర్త్యులకు భూరిమయాంగదతాహారముల్,

భూషితకేశపాశమృదు పుష్పసుగంధజలాభిషేకముల్

భూషలు గావు పూరుషుని భూషితుఁజేయుఁ బవిత్రవాణి, వా

గ్భూషణమే సుభూషణము భూషణముల్ నశించు నన్నియున్.


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 05-09-2007 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in