telugudanam.co.in

      telugudanam.co.in

   

వంటలు (కొన్ని)

బ్లాక్ వండర్ జ్యూస్

కావలసిన వస్తువులు:

నేరేడు పండ్ల రసం - ఒక కప్పు.
రాగిపిండి - 1/2 కప్పు.
ఖర్జూరపళ్ళు - 6.
రోజ్ వాటర్ - 1 కప్పు.
ఫైవ్ స్టార్ చాక్లేట్ - 1.

తయారు చేసే విధానం:

ముందుగా నేరేడు పళ్ళను కడిగి నీటిలో వేసి పిసికి గింజలను తీసి ఒక కప్పు రసాన్ని తీసుకోవాలి. రాగిపిండిని ఒక కప్పు నీటిలో ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. తరువాత గిన్నెలో నాలుగు కప్పుల నీరు పోసి మరుగుతుండగా రాగిపిండి మిశ్రమాన్ని నెమ్మదిగా పోస్తూ కలుపుతూ రెండు నిమిషాల తరువాత దించి పూర్తిగా చల్లారనివ్వాలి. ఖర్జూరపండ్ల ముక్కలు, ఫైవ్ స్టార్ చాక్లేట్ ముక్కలు, రోజ్ వాటర్ కలిపి మిక్సీలో వేసి తిప్పి అందులో నేరేడు పండ్లరసం, రాగిమిశ్రమం వేసి మరోసారి తిప్పి తీసి గాజు గ్లాసుల్లో పోసి ఇవ్వాలి. పిల్లలు చాలా ఇష్టంగా ఈ జ్యూస్ తాగుతారు.


[ వెనుకకు ]

జెల్లీ వైట్ జ్యూస్

కావలసిన వస్తువులు:

లేత ముంజలు - 8.
సగ్గుబియ్యం - 1 కప్పు.
వైట్ కలకండ - 1/2 కప్పు.
తెల్ల ద్రాక్షలు - 1 కప్పు.
కిస్ మిస్ - 1 కప్పు.

తయారు చేసే విధానం:

ముందుగా సగ్గు బియ్యం కడిగి నాలుగు గ్లాసుల నీళ్ళు పోసి ఉడికించి చల్లార్చాలి. తరువాత ముంజలు పైతొక్క తీసి వాటితో పాటు ద్రాక్షపళ్ళు కలిపి మిక్సీలో వేసి తిప్పి తీసి అందులో కలకండ, ఉడికించిన సగ్గుబియ్యం, ఐస్ వేసుకొని బాగా కలిపిన తర్వాత తాగాలి. మధ్యాహ్న సమయంలో ఈ జ్యూస్ ని తాగితే కడుపులో చల్లగా ఉంటుంది.


[ వెనుకకు ]

ఆరెంజ్ స్క్వాష్

కావలసిన వస్తువులు:

బత్తాకాయలు - 12.
సిట్రిక్ ఆసిడ్ - 7 స్పూన్లు (నిమ్మ ఉప్పు).
ఆరెంజ్ ఎసెన్స్ - 1 స్పూను.
ఆరెంజ్ కలర్ - 1/2 స్పూను.
పంచదార - 6 కప్పులు.
పొటాషియం మెటాబైసల్ఫేట్ - 1/2 స్పూను.
నీరు - 3 కప్పులు.

తయారు చేసే విధానం:

ముందుగా నీళ్ళలో పంచదార కలిపి తీగపాకం పట్టాలి. తరువాత 1/4 కప్పు వేడి నీళ్ళలో సిట్రిక్ ఆసిడ్ కలిపి పాకంలో కలపాలి. తరువాత బత్తాయిలు రసం తీసి, ఆ రసానికి ఎసెన్సు, రంగు కలపాలి. ఆ బత్తాయి రసాన్ని పాకంలో కలపాలి. 2 స్పూన్లు వేడి నీళ్ళలో పొటాషియం మెటాబైసల్ఫేట్ కలిపి రసంలో కలపాలి. పొడిగా ఉన్న గాజు సీసాలో పోసి మూత గట్టిగా పెట్టి వారం తర్వాత సర్వ్ చేయాలి.


[ వెనుకకు ]

లెమన్ స్క్వాష్

కావలసిన వస్తువులు:

నిమ్మకాయలు - 1/2 కేజీ.
సిట్రిక్ యాసిడ్ - 1 స్పూను (నిమ్మ ఉప్పు).
పొటాషియం మెటాబైసల్ఫేట్ - 1/4 స్పూను.
పంచదార - 6.5 కప్పులు.
నీరు - 3 కప్పులు.

తయారు చేసే విధానం:

ముందుగా నిమ్మకాయలు తరిగి రసం తీయాలి. తరువాత నీళ్ళలో పంచదార కలిపి, సిట్రిక్ యాసిడ్ కలిపి సన్నని సెగపై వేడి చేయాలి. తీగ పాకం వచ్చిన తరువాత దించి నిమ్మకాయ రసం కలపాలి. పొటాషియం మెటాబైసల్ఫేట్ ని కొంచెం వేడి నీళ్ళలో కలిపి సిరప్ లో కలపాలి. పొడిగా ఉన్న గాజు సీసాలో పోసి గట్టిగా మూతపెట్టి వారం తరువాత సర్వ్ చేయాలి.


[ వెనుకకు ]

మ్యాంగో స్క్వాష్

కావలసిన వస్తువులు:

మామిడిపండ్లు గుజ్జు - 3 కప్పులు.
సిట్రిక్ ఆసిడ్ - 15 గ్రా.
పొటాషియం మెటాబైసుల్ఫేట్ - 1/2 స్పూను.
పంచదార - 750 గ్రా.
నీరు - 4.5 కప్పులు.

తయారు చేసే విధానం:

ముందుగా మామిడి పండ్ల గుజ్జు తీసి, పంచదార, నీరు పోసి చక్కగా ఉడికించాలి. ఉడికిన గుజ్జు దించి చల్లార్చి సిట్రిక్ ఆసిడ్ పొడిచేసి పొటాషియం మెటాబైసల్ఫేట్ వేడినీళ్ళలో కలిపి గుజ్జులో కలపాలి. మరల గుజ్జును పల్చగా చేసి 5 నిమిషాలు ఉడికించాలి. దించి చల్లారిన తరువాత పొడిగా ఉన్న గాజు సీసాలో పోయాలి. చల్లగా, పొడిగా ఉన్న ప్రదేశాలలో నిల్వవుంచి వారం తరువాత సర్వ్ చేయాలి.


[ వెనుకకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: