telugudanam.co.in

      telugudanam.co.in

   

వంటలు (కొన్ని)

ఎగ్ పరోటా

కావలసిన వస్తువులు:

గుడ్లు - 2.
ఉల్లిపాయ సన్నగా తరిగినది - 1.
టమోటా - 1.
పరోటా - 2.
మిర్చిపొడి - సరిపడినంత.
ఉప్పు - సరిపడినంత.
జీరా - సరిపడినంత.
మిరియాల పొడి - అర టీ స్పూను.
ధనియాల పొడి - అర టీ స్పూను.
పసుపు - పావు టీ స్పూను.
రిఫైండ్ ఆయిల్ - సరిపడినంత.
కొత్తిమీర తురుము - 1 రెమ్మ.

తయారు చేసే విధానం:

కడాయిలో నూనె వేడి చేసి జీరా, ఉల్లిపాయలు, టమోటాలు వరుసగా వేసి వేగనివ్వాలి. పరోటా ముక్కలను వేసి కలపాలి. మిర్చిపొడి, ఉప్పు, పసుపు, మిరియాల పొడి, ధనియాల పొడి వరుసగా వేసి సన్నని సెగపై ఉడికించాలి. గుడ్ల సొనను చిలికి కడాయిలో పోసి కలపాలి. గుడ్లు పూర్తిగా ఉడకనిచ్చి పైన కొత్తిమీర తురుము చల్లుకోవాలి.


[ వెనుకకు ]

పెసర గారెలు

కావలసిన వస్తువులు:

పచ్చి పెసలు - 1 కిలో.
ఛాయమినపప్పు - 1 కప్పు
నూనె - తగినంత.
పచ్చిమిర్చి - 50 గ్రా.
అల్లం - అంగుళం ముక్క
జీలకర్ర - టీ స్పూను.
ఉప్పు - సరిపడినంత.

తయారు చేసే విధానం:

పెసలు, మినపప్పు కడిగి ముందురోజు రాత్రే నానబెట్టి ఉంచాలి. ఉదయాన్నే నీళ్ళు వంపేసి అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి మెత్తగా రుబ్బాలి. తగినంత ఉప్పు కూడా కలపాలి. తడిబట్ట మీద గానీ లేదా పాలకవర్ల మీద గానీ మనకు కావలసిన సైజులో గారెలు వత్తి నూనెలో దోరగా వేయించి తీయాలి. ఎంతో రుచిగా ఉండే ఈ గారెలు మూడు రోజులవరకూ నిల్వ ఉంటాయి. అల్లం, వేరుశనగ, కొబ్బరి, పుదీనా, కొత్తిమీర ఏ పచ్చడితో తిన్నా ఇవి రుచిగా ఉంటాయి.


[ వెనుకకు ]

జొన్న రైస్

కావలసిన వస్తువులు:

జొన్న నూక - 500 గ్రా.
ఉప్పు - సరిపడినంత.

తయారు చేసే విధానం:

జొన్న నూకను శుభ్రం చేసి ఉంచుకోవాలి. గిన్నెలో సరిపడినన్ని నీళ్ళు పోసి సన్నని సెగపై మరిగించి ఎసరు వచ్చాక జొన్న నూకను ఉండలు చుట్టకుండా నెమ్మదిగా వేస్తూ కలుపుతూ ఉండాలి. ఉప్పు చేర్చి రుచి సరిచూసుకోవాలి. బువ్వను పెరుగు, పచ్చిపులుసుతో కలిపి తినవచ్చు.


[ వెనుకకు ]

నువ్వుల లడ్డు

కావలసిన వస్తువులు:

నువ్వులు - 1 కిలో.
పల్లీలు - 100 గ్రా.
యాలుకల పొడి - 1 టీ స్పూను.
బెల్లం - 1 కిలో.
జీడిపప్పు - 100 గ్రా.
నెయ్యి - 100 గ్రా.

తయారు చేసే విధానం:

ముందుగా నువ్వులు, పల్లీలు, జీడీపప్పులను విడివిడీగా కడాయిలో ఆయిల్ లేకుండా దోరగా వేయించి పెట్టుకోవాలి. నువ్వులను రోట్లో వేసి దంచాలి. మధ్యలో బెల్లం, పల్లీలు, జీడీపప్పు వేసి మిశ్రమాన్ని దంచాలి. యాలకుల పొడి, నెయ్యి వేసి చక్కగా కలిపి కావల్సిన సైజులో ఉండలు చుట్టుకోవాలి.


[ వెనుకకు ]

కోవా కజ్జికాయ

కావలసిన వస్తువులు:

పాలు - 1 లీటరు.
పచ్చికొబ్బరి (తురుము) - 1.
యాలకుల పొడి - 1 టీ స్పూను.
పంచదార - 100 గ్రా.
బెల్లం - 100 గ్రా.
నెయ్యి - 50 గ్రా.

తయారు చేసే విధానం:

గిన్నెలో పాలు బాగా మరిగించి పంచదార వేసి కలుపుతూ సన్నని సెగపై పాలు చిక్కగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికిస్తూ కోవా తయారు చేసి పెట్టుకోవాలి. వేరొక గిన్నెలో బెల్లం, సరిపడినన్ని నీళ్ళతో తీగపాకం పట్టి పచ్చికొబ్బరి తురుము, నెయ్యి వేసి కలుపుతూ ఉండాలి. కొద్దిగా చల్లారాక యాలకుల పొడి వేసి బాగా కలిపి కావాల్సిన సైజులో ఉండలు చుట్టుకోవాలి. పాలకోవాను చిన్న ఉండలుగా తీసుకొని ఒక్కోదాన్ని మందపాటి పూరీలా ఒత్తి మధ్యలో కొబ్బరి ఉండను ఉంచి చుట్టూతా కోవాతో కప్పేయాలి.


[ వెనుకకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: