telugudanam.co.in

      telugudanam.co.in

   

వంటలు (కొన్ని)

కందిపొడి

కావలసిన వస్తువులు:

కందిపప్పు - అర కిలో.
పెసరపప్పు - పావు కిలో.
తెల్ల (పొట్టులేని) మినపప్పు - పావు కిలో.
శనగపప్పు - పావు కిలో.
జీలకర్ర - 25 గ్రా.
కారం - 50 గ్రా.
ఉప్పు - సరిపడినంత.

తయారు చేసే విధానం:

ఖాళీ మూకుడును వేడిచేసి పప్పులన్నిటిని నూనె లేకుండానే ఘుమఘుమ వాసనవచ్చేలా విడివిడిగా వేయించాలి. ఆఖరిన అన్ని పప్పులు కలిపి జీలకర్ర వేసి మెత్తగా పొడుం విసురుకుని తగు మాత్రంగా ఉప్పు కారాలు కలుపుకోవాలి.


[ వెనుకకు ]


కరివేపాకుపొడి

కావలసిన వస్తువులు:

కరివేపాకు - 4 కట్టలు.
చింతపండు - 150 గ్రా.
జీలకర్ర - 15 గ్రా.
ధనియాలు - దోసెడు.
శనగపప్పు - 50 గ్రా.
మినపప్పు - 50 గ్రా.
ఎండుమిర్చి - 200 గ్రా.
ఉప్పు - సరిపడినంత.

తయారు చేసే విధానం:

ఖాళీ మూకుట్లో పప్పుల్ని ఎర్రగా వేయించి తీసుకోవాలి, అలాగే జీలకర్రా, ధనియాలు కూడా వేయించి తీసి పెట్టుకోవాలి. తర్వాత ఓ చెంచాడు నూనె మరిగించి ఎండుమిరపకాయలు కరివేపాకులు కలిపి వేయించాలి. ఆఖరిన అన్నీ కలిపి సరిపడా ఉప్పు జోడించి, చింతపండు కూడా కలిపి బాగా దంచాలి. ఒక దంపుడు కాగానే సన్న జల్లెడలోకి తీసి పొడుం జల్లించాలి, మెత్తటి పొడుం దిగాక మిగిలిన పొడుం మళ్ళా దంచాలి ఇలా 4,5 సార్లు అయ్యాక పొడి మొత్తం నలుగుతుంది.


[ వెనుకకు ]


వెల్లుల్లిపాయ కారప్పొడి

కావలసిన వస్తువులు:

వెల్లుల్లిపాయలు - 4.
చింతపండు - 150 గ్రా.
నూనె - 100 గ్రా.
పసుపు - అర చెంచా.
మినపప్పు - 100 గ్రా.
శనగపప్పు - 100 గ్రా.
ఉప్పు - సరిపడినంత.
ఎండుమిర్చి - 200 గ్రా.

తయారు చేసే విధానం:

వెల్లుల్లి పొట్టువలిచి రేకలు విడిగా ఉంచుకోవాలి. నూనెకాచి పప్పులు, ఎండుమిర్చి, వెల్లుల్లిరేకలు వేయించి తీసుకుని ఉప్పు, పసుపు కలిపి మెత్తగా దంచాలి. చింతపండు మిగిలిన సగం పచ్చి వెల్లుల్లిరేకలు కూడా ఆ దంపినదానికి కలిపి మరింత మెత్తగా దంచుకోవాలి.


[ వెనుకకు ]


ధనియాలపొడి

కావలసిన వస్తువులు:

ధనియాలు - 200 గ్రా.
ఎండుమిర్చి - 200 గ్రా.
నూనె - 100 గ్రా.
మినపప్పు - 50 గ్రా.
శనగపప్పు - 50 గ్రా.
చింతపండు - కొంచెం.
ఉప్పు - సరిపడినంత.

తయారు చేసే విధానం:

నూనె కాచి ధనియాలు, ఎండుమిర్చి, పప్పులు మాడిపోకుండా జాగ్రత్తగా వేయించాలి. అనంతరం చింతపండు తగుమాత్రం ఉప్పు వేసి మెత్తగా దంచి పొడి చేసుకోవాలి.


[ వెనుకకు ]


శనగపప్పు పొడి

కావలసిన వస్తువులు:

వేయించిన శనగపప్పు - పావు కిలో.
ఎండుమిర్చి - 50 గ్రా.
జీలకర్ర - 25 గ్రా.
ఉప్పు - సరిపడినంత
ఎండుకొబ్బరి - చిన్నముక్క
వెల్లుల్లి - రెండు రెబ్బలు

తయారు చేసే విధానం:

ఖాళీ మూకుట్లో ఎండుమిర్చిని అరకొరగావేయించి శనగపప్పు, ఉప్పు, జీలకర్ర, ఎండుకొబ్బరి, వెల్లుల్లి కలిపి మెత్తగా దంచుకోవాలి. (అలాగే ఎండుమిర్చిని వేయించకుండా కూడా పొడి చేసుకోవచ్చు). దీనినే శనగపప్పు పొడుం,లేదా పప్పుల పొడుం అని కూడా అంటారు.


మూలం : అన్నపూర్ణ వంటలు, పిండి వంటలు పుస్తకములోనివి.


[ వెనుకకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: