telugudanam.co.in

      telugudanam.co.in

   

వంటలు (కొన్ని)

క్యారెట్ లడ్డు

కావలసిన వస్తువులు:

క్యారెట్ తురుము - 200 గ్రా.
పచ్చి కొబ్బరి తురుము - 50 గ్రా.
బొంబాయి రవ్వ - 30 గ్రా.
జీడిపప్పు - 10 గ్రా.
కిస్ మిస్ - 10 గ్రా.
పంచదార - 50 గ్రా.
యాలుకల పొడి - చిటికెడు.

తయారు చేసే విధానం:

క్యారెట్‌ను తురిమి కొద్దిగా రసాన్ని వడగట్టి తురుమును తీసుకోవాలి. బొంబాయి రవ్వ, జీడిపప్పులను ఆయిల్ లేకుండా విడిగా దోరగా వేయించాలి. గిన్నెలో క్యారెట్ తురుము, బొంబాయిరవ్వ, పచ్చికొబ్బరి తురుము, జీడిపప్పు, కిస్ మిస్, యాలుకల పొడి పంచదారల మిశ్రమాన్ని చక్కగా కలిపి కావల్సిన సైజులో లడ్డూలు చేసుకోవాలి.


[ వెనుకకు ]


క్యారెట్ జ్యూస్

కావలసిన వస్తువులు:

క్యారెట్ - 200 గ్రా.
బొప్పాయి - 50 గ్రా.
కర్బూజ - 50 గ్రా.
బెల్లం ముక్కలు - సరిపడినన్ని.
యాలుకల పొడి - చిటికెడు.

తయారు చేసే విధానం:

క్యారెట్, బొప్పాయి, కర్బూజా లను విడివిడిగా మిక్సీలో వేసి జ్యూస్ తయారు చేసుకోవాలి. మూడు జ్యూస్‌ల మిశ్రమాన్ని బెల్లం ముక్కలు, యాలుకల పొడితో సహా మరోసారి మిక్సీ వేసుకోవాలి. క్యారెట్ తినని వారు, ఈ జ్యూస్ త్రాగి, ఈ విధంగానైనా క్యారెట్ తినటం అలవాటు చేసుకొని క్యారెట్ వంటి మంచి పౌష్టికాహారం తమ శరీరానికి అందించండి.


[ వెనుకకు ]


పన్నీర్ చట్ పట్

కావలసిన వస్తువులు:

పన్నీర్ - 400 గ్రా.
ఉల్లిపాయలు - 100 గ్రా.
టమోటా - 125 గ్రా.
జీలకర్ర - 5 గ్రా.
జీలకర్ర పొడి - 5 గ్రా.
ధనియాల పొడి - 5 గ్రా.
మిర్చి పొడి - 10 గ్రా.
పెరుగు - 150 గ్రా.
గరం మసాల - అర టీ స్పూన్.
రిఫైండ్ ఆయిల్ - సరిపడినంత.
కొత్తిమీర - 1 రెమ్మ.
ఉప్పు - సరిపడినంత.

తయారు చేసే విధానం:

కళాయిలో నూనె కాగిన తరువాత జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. టమోటా ముక్కలు వేసి సన్నని సెగపై పది నిమిషాలు ఉడికించాక జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిర్చి పొడి, గరం మసాలా, ఉప్పు వరుసగా వేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. పెరుగు వేసి మరి కొద్దిసేపటికి పన్నీర్ ముక్కలు వేసి గ్రేవీ చిక్కబడ్డాక కళాయి దింపేయాలి. తరువాత తరిగిన కొత్తిమీర చల్లాలి.


[ వెనుకకు ]


వెజిటబుల్ స్టెప్ బిర్యాని

కావలసిన వస్తువులు:

బాసుమతి బియ్యం - 500 గ్రా.
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 30 గ్రా.
ఉల్లిపాయలు (వేయించినవి) - 1 కప్పు.
గరంమసాలా పొడి - 1 టీ స్పూను.
యాలుకుల పొడి - 1 టీ స్పూను.
ఉప్పు - సరిపడినంత.
మిర్చి పొడి - 1 టీ స్పూను.
పచ్చిమిర్చి పేస్ట్ - 1 టీ స్పూను.
పెరుగు - 200 గ్రా.
పుదీనా - పావుకప్పు.
కొత్తిమీర (తరిగినది) - 1 కట్ట.
పసుపు - అర టీ స్పూను.
పాలు - పావు లీటరు.
నెయ్యి - 100 గ్రా.
రిఫైండ్ ఆయిల్ - 100 గ్రా.
క్యారెట్ (స్లైసులు) - 1.
టమోటా (స్లైసులు) - 1.
దోసకాయ (స్లైసులు) - 1.
ఖాజూ - 50 గ్రా.
గరంమసాలా పొడి చేయనివి - 5 గ్రా.

తయారు చేసే విధానం:

ఒక గిన్నెలో పెరుగు, అన్ని మసాలాలు (గరం మసాలా కు ఉపయోగించే పదార్ధాలు పొడి చేయనివి తప్ప) వేసి పాలు పోసి కలుపుకోవాలి. దాంట్లో కొద్దిగా నూనె వేసి కలిపి పక్కనే పెట్టి దానిపై కట్ చేసి ఉంచిన కూరగాయముక్కలు పర్వాలి. వేరొక గిన్నెలో బియ్యం ఎసరు పెట్టి అందులో ఉప్పు, పొడికొట్టని గరం మసాలాలు వేసి, ఎసరు వచ్చాక బియ్యం వేసి సగం ఉడికించాక మసాలాలతో సహా వడగట్టి, తయారు చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమంపై పావుమందం వేయాలి. మళ్ళీ కొన్ని కూరగాయ ముక్కలు పేర్చి వాటిపై బియ్యం, అలా నాలుగు వరుసలు బియ్యం, కూరగాయలు వచ్చేటట్లు చూసుకొని మూతపెట్టి స్టీం బయటకు రాకుండా గిన్నె అంచులను పిండి ముద్దతో మూసివేసి పది నిమిషాలు ఉంచి దించేయాలి.


[ వెనుకకు ]


మామిడి తురుము పచ్చడి

కావలసిన వస్తువులు:

మామిడికాయ - 1(చెక్కు తీసి తురమాలి).
వేయించిన ఆవాలు - 1 చెంచా.
మెంతులు - 1 చెంచా.
కారం - 2 లేక 3 చెంచాలు.
ఇంగువ - తగినంత.
ఉప్పు, పసుపు - తగినంత.
నూనె - 2 గరిటెలు.

తయారు చేసే విధానం:

అవాలు, మెంతులు వేయించి పొడిచేసుకోవాలి. మూకుడులో నూనె వేడి చేసి అందులో ఆవాలు, ఇంగువ పోపు వేసి దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని కారం, మెంతులు, ఆవాల పొడి వేసి పెట్టుకోవాలి. అదే మూకుడులో మరికాస్త నూనె వేసి మామిడి తురుము, పసుపు, ఉప్పు, వేసి మగ్గనివ్వాలి. ఐదు నిమిషాలు మగ్గనిచ్చిన తరువాత దీనిలో పక్కకు తీసిపెట్టుకున్న కారం, మెంతిపొడి వేసిన నూనె వేసుకోవాలి. ఇది వేడి వేడి అన్నంతో నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇష్టమైన వారు దీనిలో కూడా బెల్లం కలుపుకుని తినవచ్చు.


[ వెనుకకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: