telugudanam.co.in

      telugudanam.co.in

   

వంటలు (కొన్ని)

చారుపొడి

కావలసిన వస్తువులు:

ధనియాలు - పావు కిలో.
జీలకర్ర - 50 గ్రా.
మిరియాలు - ఒక టేబుల్ స్పూన్.
ఎండుమిర్చి - 6.
కందిపప్పు - 1 చెంచా.

తయారు చేసే విధానం:

పై వస్తువులన్నీ రెండు రోజులపాటు ఎండలో ఎండబెట్టి, బాగా ఎండిన తరువాత వాటిని పొడి చేసుకోవాలి. చారు కాచేటప్పుడు పొడుము చిన్న చెంచాడు వేస్తే మంచి రుచి, సువాసన వస్తుంది.


[ వెనుకకు ]


సాంబారు పొడి

కావలసిన వస్తువులు:

మినపప్పు - 100 గ్రా.
శనగపప్పు - 100 గ్రా.
ఎండుమిర్చి - 6.
ఉప్పు - సరిపడినంత.
కారం - సరిపడినంత.
ఇంగువ - ఇష్టాన్ని బట్టి.

తయారు చేసే విధానం:

ఎండుమిర్చి ముక్కలుగా తుంపుకోవాలి. నూనె కాచి ఎండుమిర్చి ముక్కలువేసి, అవి చిటపటమన్నాక పప్పులు, ఇంగువ పలుకూ వేసి బాగా వేయించితీసి ఉప్పు, కారాలు కలిపి మెత్తగా పొడిగొట్టాలి.


[ వెనుకకు ]


దోసకాయ కూర

కావలసిన వస్తువులు:

దోసకాయలు - అర కిలో.
పచ్చిమిర్చి - 6.
వెల్లుల్లి - 2 రెబ్బలు.
ఎండుమిర్చీ - 2.
పోపుగింజలు - సరిపడినన్ని.
నూనె - 25 గ్రా.
ఉప్పు - సరిపడినంత.

తయారు చేసే విధానం:

దోసకాయలు పై చెక్కుతీసి చేదులేకుండా చూసుకుని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. పచ్చిమిర్చి వేరే ప్లేటులోకి ముక్కలుగా తరుగుకోవాలి నూనె కాచి వెల్లుల్లి ఎండుమిర్చి పోపుగింజలు కరివేపాకులూ వేసి చిటపటమన్నాక పచ్చిమిర్చి కూడా వేసి ఆ వెనకే దోసముక్కల్ని అందులో పోసి మూత పెట్టాలి ముక్క బాగా మెత్తబడ్డాక ఉప్పు చల్లుకుని కలిపి దింపుకోవాలి.


మూలం : అన్నపూర్ణ వంటలు, పిండి వంటలు పుస్తకములోనివి.


[ వెనుకకు ]


వెజిటబుల్ చట్ పట్ దోసె

కావలసిన వస్తువులు:

దోసెపిండి - 3 కప్పులు.
పచ్చి బఠాణీ - 50 గ్రా.
పన్నీరు - 50 గ్రా.
బీన్స్ - 4,5.
క్యారెట్ - 1.
క్యాప్సికం - 2.
తాలింపు దినుసులు - కొద్దిగా.
ఖాజూ పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
మిర్చి పొడి - 2 టీ స్పూన్లు.
ఉప్పు - సరిపడినంత.
ఉల్లిపాయ ముక్కలు - 2 టేబుల్ స్పూన్లు.
రిఫైండ్ ఆయిల్ - 3 టేబుల్ స్పూన్లు.
కొత్తిమీర తురుము - రెండు కట్టలు.
చీజ్ తురుము - కొద్దిగా.

తయారు చేసే విధానం:

పచ్చి బఠాణీ, బీన్స్, క్యారెట్ ముక్కలు వేడినీళ్ళలో కొద్దిసేపు ఉడికించాలి. కడాయిలో ఆయిల్ వేడి చేసి ఉల్లిపాయలువేసి దోరగా వేగాక జీరా, వెజిటబుల్స్ ముక్కలు వేసి సన్నని సెగపై ఉడికించాలి. పన్నీర్, పచ్చిబఠాణీ వేసి మరి కొద్దిసేపు ఉడికించాక, ఖాజూ పేస్ట్ వేసి మరో 5 నిముషాలు ఉడకనిచ్చి తురిమిన కొత్తిమీర చల్లి పక్కన పెట్టుకోవాలి. పెనం పై దోశవేసి దోరగా వేయించి పైన చీజ్ తురుము చల్లి ఆపై వెజ్‌కర్రీ కోటింగ్ వేసి దోశను దోరగా కాల్చాలి.


[ వెనుకకు ]


చీజ్ పాలక్ దోసె

కావలసిన వస్తువులు:

దోసెపిండి - 3 కప్పులు.
పాలకూర పేస్ట్ - సరిపడినంత.
తాలింపు దినుసులు - సరిపడినన్ని.
చీజ్ - 2 టేబుల్ స్పూన్లు.

తయారు చేసే విధానం:

కడాయిలో ఆయిల్ వేడిచేసి తాలింపు దినిసులు వేసి వేయించాక పాలకూర పేస్ట్ వేసి సన్నని సెగమీద ఉడికించి పక్కన పెట్టుకోవాలి. పెనం పైన దోసెవేసి దోరగా వేగాక తురిమిన చీజ్ చల్లి ఆపై పాలకూర పేస్ట్ కోటింగ్‌లా వేసి దోరగా కాల్చాలి.


[ వెనుకకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: