telugudanam.co.in

      telugudanam.co.in

   

వంటలు (కొన్ని)

నిమ్మకాయ పులిహార

కావలసిన వస్తువులు:

సన్న బియ్యం - 1 కేజీ.
నిమ్మకాయలు - 4.
ఎండుమిర్చి - 50 గ్రా||.
పచ్చిమిర్చి - 50 గ్రా||.
శనగపప్పు - 50 గ్రా||.
మినపప్పు - 50 గ్రా||.
ఆవాలు - 25 గ్రా||.
నూనె - 125 గ్రా||.
కర్వేపాకు - 3 రెబ్బలు.
పసుపు - 1 చిన్న చెంచా.
ఉప్పు - తగినంత.

తయారు చేసే విధానం:

అన్నం బిరుసుగా వండి వార్చీ వుంచాలి. నిమ్మకాయలు కోసి రసంపిండి, సరిపడా ఉప్పు, పసుపు వేసి కలిపి అన్నంలోపోసి అంతా కలిసేలా కలుపుకొని వుంచాలి. అనంతరం పచ్చిమిర్చీ, ఎండుమిర్చీ, కర్వేపాకు, పోపుగింజలు మొత్తం వేయించి నిమ్మరసంతో కలిపిఉన్న అన్నంలో కలపాలి.


[ వెనుకకు ]

మామిడికాయ పులిహార

కావలసిన వస్తువులు:

సన్న బియ్యం - 1 కేజీ.
మామిడికాయ - 1.
ఎండుమిర్చి - 50 గ్రా||.
పచ్చిమిర్చి - 50 గ్రా||.
శనగపప్పు - 50 గ్రా||.
మినపప్పు - 50 గ్రా||.
ఆవాలు - 25 గ్రా||.
నూనె - 125 గ్రా||.
కర్వేపాకు - 3 రెబ్బలు.
పసుపు - 1 చిన్న చెంచా.
ఉప్పు - తగినంత.

తయారు చేసే విధానం:

ముందు పుల్లనిమామిడికాయని శుభ్రపరచి - తురుంలా చేసుకొని ఉంచాలి. అన్నం వార్చి బేసిన్ లో పోసి, పసుపూ, నూనెవేసి కలపాలి. చల్లారాక మామిడి తురుమూ ఉప్పూ వేసి కలపాలి. చివరలో నూనె మరిగించి తాలింపుగింజలు, ఎండుమిర్చి, కర్వేపాకు, పచ్చిమిర్చి వేయించి తిరగమోత పెట్టుకోవాలి.


[ వెనుకకు ]

రవ్వ పులిహార

కావలసిన వస్తువులు:

బియ్యం రవ్వ - 1 కేజీ.
నిమ్మకాయలు - 12.
ఎండుమిర్చి - 50 గ్రా||.
పచ్చిమిర్చి - 50 గ్రా||.
శనగపప్పు - 50 గ్రా||.
మినపప్పు - 50 గ్రా||.
ఆవాలు - 10 గ్రా||.
నూనె - 50 గ్రా||.
కర్వేపాకు - 3 రెబ్బలు.
పసుపు - 1 చిన్న చెంచా.
ఉప్పు - తగినంత.

తయారు చేసే విధానం:

నిమ్మకాయల రసంపిండి గింజలు గట్రా ఏరేసి రసంలో ఉప్పేసి ఉంచుకోవాలి. రవ్వకి రెట్టింపు నీళ్ళని మరగబెట్టి, మరిగాక రవ్వపోసి వుడికించాలి. వుడికాక విశాలమైన స్టీలు పళ్ళెంలో గుమ్మరించి చల్లారనివ్వాలి. చల్లారాకనూనే, పసుపు వేసి కలపాలి. తర్వాత నిమ్మరసం పోసి కలపాలి. చివర్లో నూనె కాచి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండు మిర్చి, పచ్చిమిర్చి, కర్వేపాకు అన్నికలిపి వేయించి తీసి రవ్వలో పోసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి.


[ వెనుకకు ]

చింత చిగురు పప్పు

కావలసిన వస్తువులు:

చింత చిగురు - 100 గ్రా||.
కందిపప్పు - 100 గ్రా||.
పచ్చిమిర్చి - 6.
ఎండుమిర్చి - 1.
ఉప్పు - తగినంత.

తయారు చేసే విధానం:

కందిపప్పు వుడకించాలి. చింతచిగురులో పుల్లలు లేకుండా బాగా మెదిపి వుంచుకోవాలి. పచ్చిమిర్చిని సన్నగా తరుక్కోవాలి. మిర్చీ, చింత చిగురూ కలిపి వుడుకుతున్న పప్పులో పోసి మూతపెట్టి 10 ని||ల తర్వాత పప్పు వేసి బాగా మెదిపి తాలింపు పెట్టుకోవాలి.


[ వెనుకకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: