telugudanam.co.in

      telugudanam.co.in

   

వంటలు (కొన్ని)

బఠాణీ రైస్

బఠాణీలు శరీరానికి కావలసిన ప్రొటీన్స్‌ని అందిస్తాయి. ఆకుపచ్చరంగులో ఉండే పదార్థాలలో కార్బోహైడ్రేట్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువు పెంచవు కాబట్టి లావుగా ఉన్న వారు కూడ నిస్సందేహంగా తినచ్చు. అంతే కాక గింజల రూపంలో ఉండే పదార్థాలు శరీరంలోని చక్కెరశాతాన్ని తగ్గిస్తాయి.


కావలసిన వస్తువులు:

‌బియ్యం - 250 గ్రా.
పచ్చి బఠాణీలు - 150 గ్రా.
‌గరం మసాలా పౌడర్‌ - ‌1 టీ స్పూను.
అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ - 1 టీ స్పూను.
పచ్చిమిర్చి పేస్ట్‌ - 1 టీ స్పూను.

తయారు చేసే విధానం:

బాణలిలో నూనె వేసి పచ్చిబఠాణీలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ వేసి, బఠాణీ కొద్దిగా మెత్తబడ్డాక గరం మసాలా, ఉప్పు వేసి అన్నంలో కలిపి కొత్తిమీర, పుదీనాతో అలంకరించుకోవాలి. ఇది ఆనియన్‌ పచ్చిపులుసుతో తింటే బావుంటుంది.


మూలం: 15-11-08, శనివారం, సాక్షి, ఫ్యామిలీ.


[ వెనుకకు ]

‌కోకోనట్‌ రైస్‌

కొబ్బరిని ఇష్టపడనివారు ఉండరంటే అతిశయోక్తి లేదు. కొబ్బరితో రకరకాల పదార్థాలు తయారు చేసుకుంటారు. ఎటువంటి వంటకానికైనా కొబ్బరి చక్కటి రుచిని ఇస్తుంది. అన్నంతో మిక్స్‌ చేస్తే ఎలా ఉంటుందో చేసి చూడండి.


కావలసిన వస్తువులు:

‌అన్నం - 250 గ్రా.
కొబ్బరి తురుము - 2 కప్పులు.
పచ్చిమిర్చి - ‌4.
కరివేపాకు - కొద్దిగా.
కొత్తిమీర - కొద్దిగా.
పుదీనా - కొద్దిగా.
నిమ్మకాయ - సగం.
చెక్క - చిన్న ముక్క.
‌పోపుదినుసులు - 1 టీ స్పూను.
పచ్చిశనగపప్పు - 1 టీ స్పూను.
మినప్పప్పు - 2 టీ స్పూన్లు.
జీలకర్ర - 1 టీ స్పూను.
ఆవాలు - 1 టీ స్పూను.
ఎండుమిర్చి - 3.

తయారు చేసే విధానం:

బియ్యాన్ని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేసి ఆవాలు, ఎండుమిరపకాయ ముక్కలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, పుదీనా, పచ్చిమిర్చి వేసి వేగాక తురిమిన కొబ్బరిని వేసి వెంటనే ఉప్పు అన్నం కూడా వేసి కలిపి, నిమ్మరసం చేర్చి దించాక పైన కొత్తిమీర చల్లాలి. ఇది ఆనియన్‌రైతాతో తింటే బావుంటంది.


మూలం: 15-11-08, శనివారం, సాక్షి, ఫ్యామిలీ.


[ వెనుకకు ]

ఆనియన్‌రైతా‌

కావలసిన వస్తువులు:

‌పెరుగు - అర లీటరు.
ఉల్లితరుగు - చిన్న కప్పు.
కొత్తిమీర - ‌ఒక కట్ట.
టొమోటో తరుగు - కొద్దిగా.
ఉప్పు - తగినంత.

తయారు చేసే విధానం:

చిలికిన పెరుగులో ఉల్లితరుగు, సన్నగా తరిగిన కొత్తిమీర, టొమోటో తరుగు, ఉప్పు వేసి బాగా కలిపి అరగంట నానిన తర్వాత కోకోనట్‌, కొత్తిమీర రైస్‌, బఠాణీ రైస్‌,పుదీనా, టొమోటో, జీరా రైస్‌లతో తినండి. అధిక బరువు సమస్య లేని వారయితే రుచికోసం కొద్దిగా మీగడ ఉన్న పాలను కూడా వేసుకోవచ్చు.


మూలం: 15-11-08, శనివారం, సాక్షి, ఫ్యామిలీ.


[ వెనుకకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: