telugudanam.co.in

      telugudanam.co.in

   

వంటలు (కొన్ని)

ఆవియల్‌

కావలసిన వస్తువులు:

‌కొబ్బరి నూనె - 100 ml.
‌జీలకర్ర - 1 టీ స్పూన్‌.
‌కరివేపాకు - ‌1 కట్ట.
పచ్చి కోబ్బరి పేస్టు - 150 గ్రాములు.
పెరుగు - ‌25 గ్రాములు.
బియ్యపిండి. - 2 టీ స్పూన్స్.
‌పచ్చిమిర్చి - 12.
‌పాలు - 200 ml.
‌ఉప్పు - తగినంత.
‌మునక్కాయలు - ‌100 గ్రాములు.
క్యారట్ - 100 గ్రాములు.
బీన్స్ - ‌100 గ్రాములు.
తెల్ల గుమ్మడికాయ - 100 గ్రాములు.
‌పచ్చి అరటికాయ - 100 గ్రాములు.
‌కంద - 100 గ్రాములు.

తయారు చేసే విధానం:

కూరగాయలను పొడవు ముక్కలుగా తరిగి, ఉడికించి నీటిని వడపోసి ముక్కలను పక్కన ఉంచాలి.

బాణలిలో కొద్దిగా కొబ్బరి నూనె వేసి కాగిన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు కొబ్బరి పేస్టు, పెరుగు, బియ్యప్పిండి వేసి సన్న మంట మీద కొద్ది సేలు ఉడికించి, అందులో పాలను వేయాలి.

అవి మరిగేటప్పుడు కూరగాయ ముక్కలను వేసి కొద్ది సేపు ఉడికించాలి. దించేముందు మిగిలిన కొబ్బరినూనె పోసి బాగా కలపాలి.


[ వెనుకకు ]

‌‌ఐసీ చెర్రీస్‌

కావలసిన వస్తువులు:

‌‌చెర్రీ పండ్లు - 3.
‌వెనీలా ఐస్‌ క్రీమ్‌ - పావుకప్పు.
‌‌నీళ్ళు - ‌పావుకప్పు.
‌ఉప్పు - చిటికెడు.

తయారు చేసే విధానం:

ర్రీ పండ్లని పావుకప్పు నీటిలో ఉడికించాలి. ఆ నీటిని చల్లార్చి పండ్లతో సహా గ్లాసులో పోసి పైన ఐస్‌ క్రీమ్‌ అమర్చండి. అంతే ఐస్‌ చెర్రీ రెడీ.


[ వెనుకకు ]

‌స్వీట్‌ దోసె

కావలసిన వస్తువులు:

‌‌మైదా - 1 కప్పు.
‌పాలు - కలపడానికి సరిపడా.
‌‌పంచదార - ‌పావు కప్పు.
ఏలకులపొడి - 1 టీ స్పూన్‌.
బాదం పప్పు - ‌2 టీ స్పూన్స్.
నూనె - ‌కాల్చడానికి సరిపడా.

తయారు చేసే విధానం:

ఒక పాత్రలో మైదా, ఏలకులపొడి, పంచదార, బాదంపప్పు ఒకదాని తరువాత ఒకటి తీసుకుని, పాలతో కలుపుకోవాలి.

ఉండలుండలుగా లేకుండా బాగా కలపాలి.

మరీ పలచగా కాకుండా గరిటజారుడు దోసె పిండిలా కలుపుకోవాలి

పెనం వేడయ్యాక గరిటతో పిండిని తీసుకుని దోసెలా వేసి,దోసె చుట్టూ నూనె వెయ్యాలి.

గోల్డెన్‌ బ్ర్రౌన్‌ కలర్ వచ్చేవరకు ఉంచి నెమ్మదిగా తీసి వెనక వైపు తిప్పేసి 5 సెలన్లు కాల్చాలి.

వేడివేడి నెయ్యి వేసి వడ్డించాలి.


[ వెనుకకు ]

‌‌గుల్‌కండ్ గుమ్మడి హల్వా

కావలసిన వస్తువులు:

‌‌బూడిద గుమ్మడికాయ - 1.
‌రోజ్‌ వాటర్ - 200 ml.
‌‌ఏలుకలు - ‌‌5 గ్రాములు.
నెయ్యి - 200 గ్రాములు.
జీడిపప్పు - 50 గ్రాములు.

తయారు చేసే విధానం:

బూడిద గుమ్మడికాయ చెక్కు తీసి ముక్కలుగా కోసి గింజలు తీసేయాలి్. గుమ్మడికాయ ముక్కలనుం తురుముకోవాలి. మూకుడులో నెయ్యి వేడిచేసి గుమ్మడికాయ తురుము వేసి నెయ్యి పైకి తేలే వరకు వేయించాలి. తరువాత పంచదార, రోజ్‌ వాటర్‌ని కలిపి సన్నని మంటమీద ఉడికించాలి

హాల్వా చిక్కబడిన తర్వాత దించేయలి. చివరిగా హల్వ మీద ఏలుకల పొడి చల్లి జీడిపప్పు అలంకరించాలి. ఒక కప్పు గుల్‌కండ్‌గుమ్మడిహల్వాతో 500 కేలరీలు ఉంటాయి. ఇందులో కుంకుమ పువ్వు కలుపుకుంటే ఆకర్షణీయంగా ఉంటుంది. రుచి పెరుగుతుంది. రోటీ, చపాతీలకు ఇది మంచి కాంబినేషన్‌ దీనిని పిల్లలు ఇష్టంగా తింటారు.


[ వెనుకకు ]

మిర్చి కా సాలన్‌

కావలసిన వస్తువులు:

‌‌పెద్దసైజు పచ్చిమిరపకాయలు - 10.
‌ఎండు కొబ్బరి తురుము - అర కప్పు.
‌‌వేరుశనగ పప్పు - ‌అర కప్పు.
అల్లంవెల్లుల్లిపేస్ట్ - 1 టీ స్పూను.
నూనె - వేయించేందుంకు తగినంత.
జీలకర్ర - అర టీ స్పూన్‌.
‌‌కారం - 1 టీ స్పూన్‌.
‌టొమాటోలు - 2.
‌‌చింతపండు గుజ్జు - ‌అర కప్పు.
ఉప్పు - తగినంత.

తయారు చేసే విధానం:

వేరశెనగ పప్పు, ఎండు కొబ్బరి, ధనియాలు, సగం జీలకర్ర మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిరపకాయలను శుభ్రపరచి తొడిమలతో సహా నూనెలో వేయించాలి.

కడాయిలో ఐదు టీ స్పూన్ల నూనె వేడిచేసి జీలకర్ర, అల్లంవెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, వేసి వేయించాలి.

ఈ మిశ్రమానికి గ్రైండ్ చేసివుంచిన మిశ్రమం కూడా కలిపి నూనె పైకి తేలే వరకు ఉడికంచాలి. దీనికి చింతపండు రసం కూడా కలిపి సన్నని మటమీద మగ్గనివ్వాలి.

చివరిగా వేయించివుంచిన మిరపకాయలు, టొమాటోలి కలిపి మరో పది నిమిషాలు మగ్గమిచ్చి స్టౌపైనుంచి దించేయాలి. పైన కొత్తిమీర చల్లి గార్నిష్ చేసుకోవాలి.


[ వెనుకకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: