telugudanam.co.in

      telugudanam.co.in

   

వంటలు (కొన్ని)

బ్రెడ్‌ ఆనియన్‌ దహివడ

కావలసిన వస్తువులు:

‌బ్రెడ్‌ - 5 ప్లైస్‌లు.
‌ఉల్లిపాయ - 1 (సన్నగా తరగాలి).
‌అల్లం తురుము - ‌1 టీ స్పూన్‌.
పచ్చిమిర్చి - 2.
పెరుగు - ‌1 కప్పు.
ఉప్పు - తగినంత.
‌కారం - కొద్దిగా.
చాట్‌ మసాల - 1 టీ స్పూన్‌.
‌కొత్తిమీర - గార్నిష్‌కి.

తయారు చేసే విధానం:

పెరుగులో అల్లం తరుగు, పచ్చిమిర్చి, కారం, ఉప్పు వేసి మిక్సీలో ఒక రౌండ్‌ బ్లెండ్‌ చేయాలి.

బ్రెడ్‌ చివరలు కట్‌ చేసి స్లైస్‌ని నీటిలో నీళ్లలో ముంచి, నీరంతా పిండేయాలి. ఆ తర్వాత గట్టిగా అదిమి మధ్యలో రంధ్రం చేయాలి. అప్పుడు చూడటానికి వడలా ఉంటుంది.

ఒక ప్లేట్‌లో బ్రెడ్‌ వడలను తీసుకుని, వాటిమీద బ్లెండ్ చేసిన పెరుగు మిశ్రమాన్ని వేసి, పైన చాట్‌ మసాలా ఉల్లిపాయ ముక్కలు చల్లాలి.

కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.


[ వెనుకకు ]

‌‌ఆవాల రైస్

కావలసిన వస్తువులు:

‌‌బియ్యం - అర కేజి.
‌ఆవాలపొడి - 2 స్పూన్స్.
‌‌నూనె - ‌2 టేబుల్‌ స్పూన్స్.
‌జీలకర్ర, ఆవాలు - 1 టీ స్పూన్‌.
‌మినప్పప్పు - ‌1 టీ స్పూన్‌.
వేరుశనగలు - 1 టీ స్పూన్‌.
‌కారం - 1 టీ స్పూన్‌.
‌‌కరివేపాకు - ‌2.
‌ఉప్పు - సరిపడా.
‌పసుపు - ‌చిటికెడు.
వెల్లుల్లి - 3.

తయారు చేసే విధానం:

ముందుగా అన్నం వండేసి, పక్కన చల్లారబెట్టుకోవాలి.

పాత్రలో నూనె వేడయ్యాక, ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాక, కరివేపాకు వెల్లుల్లి పసుపుని వేసి కలపాలి.

వేరుశనగ, మినప్పప్పు వేసి ఎర్రగా వేయించుకోని పక్కన పేట్టుకోవాలి. చల్లారబెట్టుకున్న అన్నంలో ఉప్పు, ఆవాలపొడి వేసి కలపాలి.

ఆ తరువాత పక్కుపెట్టుకున్న పోపు మిశ్రమాన్ని కూడా అన్నంలో వేసి కలపాలి.


[ వెనుకకు ]

కొత్తిమీర రైస్‌

కావలసిన వస్తువులు:

‌‌బియ్యం - 2 కప్పులు.
‌కొత్తిమీర - ఒక పెద్ద కట్ట (సన్నగా తరగాలి).
‌‌పచ్చిమిచ్చి - ‌4.
అల్లం - 1.
వెల్లుల్లి - ‌6.
టొమాటో - ‌2.
లవంగాలు - 6.
ఏలుకలు - 2.
దాల్చినచెక్క - 2.
ఉప్పు - తగినంత.
నెయ్యి - 2 టేబుల్‌ స్పూన్స్.

తయారు చేసే విధానం:

పాత్రలో టేబుల్‌ స్పూన్‌ నెయ్యి వేసి వేడయ్యాక పచ్చిమిచ్చి, కొత్తిమీర వేసి నిమిషం పాటు వేయించుకుని దింపి చల్లార్చుకోవాలి.

వేయించిన కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిని పేస్ట్‌చేయాలి. గట్టిగా అయితే కొద్దిగా నీరు కలుపుకోవచ్చు.

కడాయిలో మిగతా నెయ్యి వేసి, మసాలా దినుసుల్ని వేయించాక కొత్తిమీత పేస్ట్ కలిపి వేయించుకోవాలి.

తరిగిన టొమాటో ముక్కలు వేసి కలిపి, మూడు నిమిషాలపాటు వేగనిచ్చి ఉప్పు కలపాలి. ఇందులో మూడున్నర కప్పుల నీళ్లుపోసి పరుగుతుండగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి కలియబెట్టి అన్నం అయ్యేవరకు ఉంచాలి.

ఇష్టమైన కర్రీ కాంబినేషన్‌తో కొత్తిమీర రైసుని వేడివేడిగా వడ్డించాలి.


[ వెనుకకు ]

‌‌చింతకాయ - పాలకూర పప్పు

కావలసిన వస్తువులు:

‌‌చింతకాయ ముక్కలు - పావు కిలో.
‌కంది పప్పు - 1 కప్పు.
‌‌పాలకూర - ‌‌1 కట్ట.
ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగాలి).
నూనె - టేబుల్‌ స్పూన్‌.
పచ్చిమిర్చి - 4.
ఎండుమిర్చి - 3.
కరివేపాకు - 2.
ఉప్పు - తగినంత.
జీలకర్ర, ఆవాలు - 1 టీ స్పూన్‌.
ఇంగువ - చిటికెడు.
కొత్తిమీర - తగినంత.

తయారు చేసే విధానం:

ముందుగా పాత్రలో కప్పు నీళ్లు పోసి చింతకాయ ముక్కలు వేసి మెత్తగా ఉడకబెట్టి, మెదుపుకోవాలి. మెదిగిన చింతకాయ ముక్కలను గట్టిగా పిండేసి, రసం తీసుకోవాలి.

కుక్కర్‌లో రెండు కప్పుల నీళ్లు పోసి కంది పప్పు, పాలకూర, పచ్చిమిర్చి వేసి 3 విజిల్స్ వచ్చేవరకు ఉడకబెట్టుకోవాలి.

పాత్రలో నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి.

ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి రెండు నిమిషాలు వేయించాలి.

ఉడకబెట్టుకున్న ప్పప్పు మిశ్రమాన్ని పోపులో పోసి, చింతకాయగుజ్జు, ఉప్పు, నీటిని అందులో కలిపి, పదిహేను నిమషాలుంచి దింపేయాలి.

సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలిపి వడ్డించాలి.


[ వెనుకకు ]

‌‌మైసూర్‌ రసం

కావలసిన వస్తువులు:

‌‌కందిప్పప్పు - అర కప్పు.
‌చింతపండు - 15 రేకులు (3 కప్పుల వేడి నీళ్లలో నానబెట్టుకోవాలి).
‌‌టొమాటో - ‌1.
పసుపు - చిటికెడు.
ఉప్పు - తగినంత.
కందిపప్పు - 1 టేబుల్‌ స్పూన్‌.
మిరియాలు - 2 అర టేబుల్‌ స్పూన్‌.
మెంతులు - పావు టీ స్పూన్‌.
జీలకర్ర - పావు టీస్పూన్‌.
ధనియాలు - అర టీ స్పూన్‌.
ఎండుమిర్చి - 4.
కొబ్బరి తురుము - అర టేబుల్‌ స్పూన్‌.
నెయ్యి - 1 టీ స్పూన్‌.
జీలకర్ర, ఆవాలు - అర టేబుల్‌ స్పూన్‌.
కరివేపాకు - 3.

తయారు చేసే విధానం:

ముందుగా కందిపప్పుని ఫ్రజర్‌ కుకర్‌లో వేసి మెత్తగా ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి.

పాత్రలో 1 టీ స్పూన్‌ నూనె వేసి, పౌడర్ కోసం చెప్పిన దినుసులన్నీ వేసి 3 నిమిషాలపాటు వేయించాలి. కొబ్బరి తురుము జత చేసి మరో నిమిషం పాటు వేయించాక చల్లార్చి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి

పాత్రలో నెయ్యి వేడయ్యాక, జీలకర్ర, ఆవాలు చిటపటలాడించి పసుపు, కరివేపాకుని వేసి నిమిషంపాటు వేయించుకున్నాక టొమాటో ముక్కల్ని వేసి మరో నిమిషాలు మరగనివ్వాలి. చివరగా కొత్తిమీర వేసి దింపేసుకోవాలి.

వేడి, వేడి అన్నంలో అప్పడం, నెయ్యి కాంబినేషన్‌లో వడ్డించాలి.


[ వెనుకకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: