telugudanam.co.in

      telugudanam.co.in

   

ఖడ్గ మృగం

ఖడ్గ మృగం చూడటానికి భయంకరంగా ఉంటుంది కదా! నిజమే ...అమ్మో అడవిలో జంతువులన్నిటినీ వేటాడి తినేస్తుందేమో చాలా మందికి తెలియదు కాని... ఖడ్గ మృగం శాఖహారి. ఒళ్లంతా దట్టమైన మొద్దు చర్మం, ముక్కు పైన కత్తిలాగా ఉండే కొమ్ము చూస్తుంటే గగ్గుర్పొడుస్తుంది. కొన్ని జాతుల ఖడ్గ మృగాలకు రెండు కొమ్ములు (ఖడ్గాలు) కూడా ఉంటాయి. ఇంగ్లీషులో దీన్ని రినోసెరోస్ అంటారు. ఈపదం ముక్కు, కొమ్ము అని అర్దం వచ్చే రెండు గ్రీకు పదాల కలయికతో ఏర్పడింది. దీనికి వాసన పసిగట్టె శక్తి చాల ఎక్కువ. వినికిడి కూడా ఎక్కువే. కాని కంటి చూపు మాత్రం చాలా తక్కువ. ఆసియాలో మూడు రకాల జాతులు కనిపిస్తాయి. మన దేశంలో ఎక్కువగా గంగ, బ్రహ్మపుత్ర నదీ తీరాలలో కనిపిస్తాయి. ఇండియాలో ఉన్నవన్నీ దాదాపు అస్సాం కజిరంగా నేషనల్ పార్కులోనే ఉన్నాయి. ఖడ్గ మృగం నీటిలో బాగా ఈదుతుంది. ఎప్పుడూ ఒంటరిగానే తిరుగుతుంది. ఒక్కో ఖడ్గమృగం పది నుండి పదిహేను చదరపు కిలో మీటర్ల పరిదిలో తన ఆహారం కోసం తిరుగుతుంది. తను నడిచే దారి మరచిపోకుండా పేడతో గురుతులు పెడుతుంది. ఏజంతువైనా ఎదురు వస్తే వెంటనే పోట్లట పెట్టుకోదు.

మగ ఖడ్గ మృగాలైతే తనతో సమానమైన బలం ఉన్న వాటితోనే యుద్ధానికి దిగుతాయి. ఖడ్గ మృగం తల్లి గర్భంలో పదహారు నెలలపాటు ఉంటుంది. దాదాపు 65 కేజీల బరువు ఉంటుంది. ఒక కానుపులో ఒక పిల్ల మాత్రమే పుడుతుంది. మళ్ళీ ఇంకో పిల్ల పుట్టే వరకు తల్లితోనే ఉంటుంది. వీటి కొమ్ములు ఔషదాలుగా ఉపయోగించుకోవచ్చనే భ్రమతో విచక్షణారహితముగా వేటాడుతుండటం వలన ఖడ్గ మృగాల సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతుంది.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: