telugudanam.co.in

      telugudanam.co.in

   

సుఖానికి ఆధారం

మనిషి వంటి వికసిత ప్రాణికి సుఖాన్ని పొందాలనే కోరిక సహజమైనదే. ప్రతిప్రాణీ సుఖాన్ని పొందడానికి ప్రయత్నిస్తుంది. జీవితమనే గడియారాన్ని నిరంతరం నడిచేటట్లు చేసే కీ ఈ ప్రయత్నమే కీ ఇవ్వకపోతే, గడియారం ఆగిపోతుంది. అలాగే - సుఖాన్ని పొందాలనే వాంచ్చ సమాప్తం అయితే, ప్రాణి జీవచ్ఛవం అయిపోతుంది.

సుఖం వ్యక్తి యొక్క మానసిక స్తితిపై ఆధారపడి వుంటుంది. కనుకనే - ఫలనా వస్తువును వినియోగించడంలో అనుభవించడంలో సుఖం ఉన్నదని చెప్పలేము. పందికి మురికీ, బురద, చెడు వాసన సుఖాన్ని ఇస్తాయి. దాన్ని మానసిక స్తితి అలాంటిది కనుక. కానీ, మనిషి వీటిని అసహ్యించు కొంటున్నాడు. అంతేకాదు. వేర్వేరు మానసిక స్వభావాలు కలిగిన మనుషుల సుఖం సాధనాలు వేరువేరుగా వుంటాయి. త్రాగుడు అలవాటైన వ్యక్తికి మద్య సుఖాన్ని ఇస్తుంది. కానీ మద్యం వల్ల కలిగే భయంకర పరిణామాలను గుర్తించిన వ్యక్తి దాన్ని ముట్టుకోవడమే పాపమని భావిస్తాడు.

పరమేశ్వరుడు మనిషికి ఇచ్చినన్ని సుఖాలు, సౌకర్యాలు మరే ప్రాణికీ ఇవ్వలేదు. మనిషి అంత:కరణ వివేకంతో నిండి ఉన్నది. ఈసృష్టిని సుందరంగా, సుఖమయంగా, సప్పనంగా రూపొందించడంకోసమే దేవుడు మనిషికి ఇన్ని శక్తులను, ఇన్ని సామర్ధ్యాలను ఇచ్చాడు. మనిష్కీ, ఇతరప్రాణులకూ మధ్య ఉన్న సరిహద్దురేఖ ఇదే. ఈ రేఖ ను పాటించినప్పుడే మనిషి జీవితం ఉత్క్రుష్టం అవుతుంది, సార్ధకం అవుతుంది. మానవోచితమైన సుఖానికీ, పసువు సుఖానికీ మధ్య తేడా ఉండితీరాలి. భోగంవల్ల సుఖం కలుగుతుంది. అది ఇంధ్రియాలను త్రుప్తిపరుస్తుంది. ఈతృప్తి క్షణికమైనది. ఈసుఖం అగ్నిలో నెయ్యి పోయటం వంటిది. ఎండమావుల్లో నీళ్ళు వెదకడం వంటిది. ఇంధ్రియాలనుండి జనించిన ఈసుఖ వాంచ పసువు సుఖం కన్నా నికృష్టమైనది, బ్రమలో ముంచేది. ఇది మనిషియొక్క గరిమను, కర్తవ్యాన్ని భ్రష్టం చేస్తుంది.

మనిషి వివేకంకలిగిన జీవి. అటడు అంతరాత్మ యొక్క వాణిని వింటాడు. అతడికి నిజమైన సుఖం సేవాసాధనలోనే దొరుకుతుంది. మనిషికి అతడి గొప్పతనాన్ని విసిష్టతనూ తెలియచెప్పడాన్ని సేవాసాధనను మించిన కర్మ లేదు. నేను భోజనానికి కూర్చున్నాను. ఆ భోజనం వల్ల నాఆకలి తీరుతుంది. నా ఇంధ్రియాలకు క్షణికమైన సుఖం దొరుకుతుంది. కానీ నాఆకలి శాశ్వతంగా తీరదు. మరొకరు నాకన్నా ఆకలిగా వుంటే, నేను భోజనంలో స్గాన్ని అతనికి ఇస్తే - ఆకలిగొన్న ఆవ్యక్తి పొందిన సంతృప్తిని చూచినప్పుడు నా ఆత్మలో కలిగే ఆనందమే నిజమైనసుఖం. మనిషి తన సంపాదనలోని పదవ భాగంతో తన శారీరక అవసరాలను తీర్చుకోగలుగుతారు. భగవంతుడు మనిషిని అంతటి శక్తి సామర్ధ్యాలను ఇచ్చాడు. మిగతా భాగాన్ని మనిషి సమాజ శ్రేయస్సుకు, లోక కళ్యానానికి వినియోగించాలి. ఆవిధంగా మనిషి సమాజరుణాన్ని తీర్చుకోగలుగుతున్నాడు. అప్పుడే అతడు సుఖాన్ని పొందగలుగుతాడు. సమాజ ఋణాన్ని తీర్చడానికి ఎలాంటి ప్రయత్నం చేయక పోతే - మనం నిజమైన సుఖాన్ని పొందలేము.

దేవుడు మనిషికి సంపాదించడంకోసం రెండు చేతులు ఇచ్చాడు. ఉదరపోషణకు ఒక నోరే ఇచ్చాడు. దీనివెనుక ఒక్క సిధ్ధాంతం వున్నది మనం సంపాదించిన దానిలో సగం మనం శరీరానికీ, మన కుటుంబానికి వినియోగించాలి, మిగతా సగం లోక కళ్యాణానికి వినియోగించాలి. త్యాగం కోసం, పరోపకారం కోసం, లోక కల్యాణంకోసం మనం స్వార్ధాలను వదులుకోవడం ద్వారా మనం ఎవరి పట్లా దయ చూపడంలేదు; సమాజం మనకు ఇచ్చిన రుణాన్ని తీర్చుకొంటున్నాము అంతే. మన పూర్వులు తమ సేవా సాధన ద్వారా విశ్వమే వుధ్యానవనాన్ని శోభాయమానం చేశారు, సుగంధభరితం చేశారు. దాన్ని ఫలితం మనం సామర్ధ్యానికి మంచి సంపాదించ గలుగుతున్నాము. ఈ సంపాదనను మన వరకే, మనకుటుంబము వరకే చేసుకొంటే మనం సుఖపడలేం, ఇతరులను సుఖపెట్టలేము; పైగా కృతఘ్నలం అయిపోతాము.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: